Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజంతా తాజాదనంతో మెరిసిపోవాలనుకుంటే..!?

Advertiesment
Camomile oil
, మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (10:58 IST)
రోజంతా తాజాదనంతో మెరిసిపోవాలనుకుంటున్నారా.. అయితే మిల్క్ బాత్ చేయండని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు. మిల్క్‌ బాత్‌లో చర్మ సౌందర్యం మెరుగవడంతో పాటు రోజంతా తాజాదనం అలాగే ఉంటుందని వారు సూచిస్తున్నారు. 
 
ప్రతిరోజూ బకెట్‌ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానం చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుంటే ఇట్టే తెలిసిపోతుంది. అలాగే  కాస్తంత కలబంద గుజ్జును బకెట్ నీటిలో వేసి స్నానం చేస్తే.. ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడటమేగాక, అందులోని సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి.
 
ఇక అలసత్వం దూరం కావాలంటే.. గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది. శరీరాన్ని శుభ్రపరచడంతోపాటు మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇంకా కామొమైల్ ఆయిల్‌ను నీటిలో వేసుకుని స్నానం చేస్తే పొడి చర్మంగల వారికి స్వాంతనివ్వడంతో పాటు అలసత్వం దూరమవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu