Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొజ్జ తగ్గాలంటే.. పరగడుపున 2 టమోటాలు తినండి.. పుదీనా ఆకుల రసాన్ని?

బొజ్జ తగ్గాలంటే.. ప్రతిరోజూ పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను తినాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. టమోటాలోని ఆక్సో ఓడీఏ అనే పదార్థం కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగండ

Advertiesment
Lose Belly Fat
, బుధవారం, 12 ఏప్రియల్ 2017 (11:30 IST)
బొజ్జ తగ్గాలంటే.. ప్రతిరోజూ పరగడుపున ఒకటి లేదా రెండు టమోటాలను తినాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. టమోటాలోని ఆక్సో ఓడీఏ అనే పదార్థం కొవ్వును కరిగిస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే పుదీనా ఆకుల రసాన్ని తాగండి. దీనివల్ల మెటబాలిజం పెరిగి, ఒంట్లోని క్యాలరీలు కరిగిపోతాయి.

అలాగే ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో అల్లం రసం కలుపుకుని తాగండి. దీని వల్ల కొవ్వు తగ్గడమే కాదు. అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తీసుకుని, అందులో నిమ్మకాయను పిండి తాగండి. 
 
అవసరమైనే ఒక స్పూన్ తేనె కూడా కలుపుకుని తాగడం ద్వారా.. బొజ్జ తగ్గిపోతుంది. అలాగే రోజూ పరగడపున అలోవెరా జ్యూస్ తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంది. ఇది తీసుకున్న అరగంట తర్వాత ఒక తాజా పండును తింటే సరిపోతుంది. బరువు తగ్గాలనుకున్నవారు రోజూ సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల మెటబాలిజమ్ రేట్ పెరిగి, అధిక బరువు పెరగకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.. రాత్రిపూట గేమ్స్ వద్దు..