నిద్రపోయే ముందు ఏం చేస్తున్నారు?
చాలామంది నిద్ర ఎప్పుడుపడితే అప్పుడు పోతుంటారు. కానీ నిద్రకు తప్పకుండా షెడ్యూల్ అవసరం. నిద్ర రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య ఉండాలని, కనీసం ఏడు నుంచి 8 గంటల సమయం అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నిద్రపోతున్న క్షణాల ముందు పని ఒత్తిడి గురించి ఆలోచించకూడదు. డైరీలో లేదా కాగితంపై తర్వాత రోజు చేయాల్సిన అన్ని ముఖ్యమైన పనుల గురించి రాసుకోవాలి. అప్పుడు నిద్రించే సమయంలో మైండ్ ప్రశాంతంగా ఉంటుంది.
రాత్రి 10 గంటలకు టీవీ స్విచ్ ఆఫ్ చేసేయాల్సిందే. ఎంత ఉత్సాహం ఉన్నా 10 తర్వాత మెసేజ్, కాల్ లేదా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సర్ఫింగ్ మానివేయాలి.
కెఫిన్, మద్యం మరియు నికోటిన్ వంటివి రాత్రి నిద్రను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా వుండటం మంచిది. నిద్రకు ముందు ముఖ్యంగా ధాన్యాలు మరియు చక్కెరతో కూడిన అల్పాహారంను నివారించాలి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.