Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలో అంతే తీసుకోవాలి!

Advertiesment
protein
, సోమవారం, 28 మార్చి 2016 (18:06 IST)
మాంసకృత్తులు శరీరానికి అవయవాల నిర్మాణ కార్యక్రమానికి పనికొస్తాయి. మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్దవయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం. పెద్దగా దెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయపడుతుంది. 
 
గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి. అయితే మాంసకృత్తులను కొంతమేరకే తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఆహారంలో మాంసకృత్తులు ఎంతవరకు తీసుకోవాలంటే?
మాంసాహారులకు లభించే మాంసకృత్తులు, అధికశాతం నాణ్యమైన అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది. శాకాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి పొందవచ్చు. ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు, పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతో తయారైన పదార్ధాలు, జంతు మాంసము, చేపలు, చికెన్ ద్వారా లభిస్తాయి.
 
వృక్షాల ద్వారా లభించే ఆహారంలో సొయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంట 40 శాతం ఉంటాయి. బాలురకు రోజుకు 78 గ్రాముల మాంసకృత్తులు అవసరం. అదే విధంగా 16-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 50 కేజిల బరువు గల బాలికలకు రోజుకు 63 గ్రాములు అవసరమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇకపోతే.. గర్భవతికి రోజుకు 65 గ్రాములు ఒక రోజుకు అవసరమవుతాయి పాలిచ్చే తల్లులకు/బాలింతలకు 6 నెలల వరకు 75 గ్రాములు 1 రోజుకు అవసరమవుతాయని వారు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu