మీ మెడ చండాలంగా ఉందా.. అయితే ఇది చేయండి..?
మహిళలు అందం విషయంలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత మెడకు ఇవ్వరు. అందుకే చాలామంది స్త్రీల మెడ బాగంలో నల్లగా ఉంటుంది. మెడ దగ్గర చర్మం నల్లగా ఉండడమే కాకుండా మెడచర్మం వదులవ్వడం వల్ల మెడ అందాన్ని కోల్పోతుంది.
మహిళలు అందం విషయంలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యత మెడకు ఇవ్వరు. అందుకే చాలామంది స్త్రీల మెడ బాగంలో నల్లగా ఉంటుంది. మెడ దగ్గర చర్మం నల్లగా ఉండడమే కాకుండా మెడచర్మం వదులవ్వడం వల్ల మెడ అందాన్ని కోల్పోతుంది. మెడమీద చర్మం వదులుగా అవ్వడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ప్రధానమైనవి... వయస్సు పైబడటం. పోషకాహారలోపం వల్ల, చర్మసంరక్షణ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కారణాల జరుగుతాయి.
స్కిన్‌ను టైట్ చేసుకోవాలంటే ఎఫన్షియల్ ఆయిల్స్‌ను ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలంటున్నారు వైద్యులు. కొబ్బరినూనెతో గానీ, ఆలివ్ ఆయిల్‌తో గానీ మెడపై మసాజ్ చేసుకోవాలట. ఏదో ఒక నూనెను తీసుకొని గోరువెచ్చగా చేసి అప్లై చేసుకోవాలట. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ జరుగుతుంది. వదులైన చర్మం టైట్ అవుతుంది.
మరొక పద్ధతి ద్వారా కూడా మెడను నలుపుదనం నుంచి కాపాడుకోవచ్చట. గుడ్డును తీసుకొని పవర్‌ఫుల్ యాంటీ యాక్సిడైట్స్ ఉంటాయి... ఇవి మెడ, గొంతు భాగంలో వదులైన చర్మాన్ని టైట్‌గా మారుస్తుంది. గుడ్డు నుంచి వైట్‌ను వేరుచేసి మెడచుట్టూ పూసుకోవాలి. 10 నిమిషాల క్లాత్‌తో తుడిచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాగిన చర్మాన్ని యాపిల్ స్లెడర్ వెనిగర్‌తో కూడా టైట్‌గా చేసుకోవచ్చు.
కొద్దిగా నీటిలో యాపిల్ స్లెడర్ వెనిగర్‌ను వేసి మెడకు పూయాలి. కొద్దిసేపటి తర్వాత కడిగెయ్యాలి. ఇలా వారానికి ఒకటి, రెండు సార్లు చేస్తే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మెడకు సంబంధించిన వ్యాయామం, యోగా కూడా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మెడ నాజూగ్గా ఉంటుందట.