Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్నాక్స్‌కు ఆపిల్, బాదం పలుకులు చాలు.. సమోసా వద్దే వద్దు

సాయంకాలం పూట స్నాక్స్ తినాలనిపిస్తుంది. వేడి వేడి బజ్జీలు, సమోసాలు తినొద్దు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆయిల్ ఫుడ్‌పై దృష్టిపెట్టకూడదని అలా పెడితే ఊబకాయం తప్పదని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. సాయం

స్నాక్స్‌కు ఆపిల్, బాదం పలుకులు చాలు.. సమోసా వద్దే వద్దు
, సోమవారం, 17 అక్టోబరు 2016 (10:45 IST)
సాయంకాలం పూట స్నాక్స్ తినాలనిపిస్తుంది. వేడి వేడి బజ్జీలు, సమోసాలు తినొద్దు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఆయిల్ ఫుడ్‌పై దృష్టిపెట్టకూడదని అలా పెడితే ఊబకాయం తప్పదని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.

సాయంకాలం పూట ఆకలైతే సుమారు 13-14 బాదం పప్పులు తినమంటున్నారు.  ఇది హెల్దీ స్నాక్. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉన్నా.. కడుపు నిండుతుందని వారు చెబుతున్నారు. 
 
రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండడమే కాక, కేలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని కరకరలాడే యాపిల్‌ను సాయంత్రం స్నాక్స్ తీసుకునే సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ లభిస్తుంది. కొలెస్టరాల్ కూడా బాగా తగ్గుతుంది. 
 
కడుపు నిండి, తక్కువ కేలరీలు శరీరానికి లభించాలంటే స్నాక్స్ టైమ్‌లో 30 ద్రాక్ష పండ్లు తినండి. ఇవి రక్తహీనత, అలసట, కీళ్ళ నొప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను, తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఇందులో కేవలం ఇవి 100 కేలరీలు మాత్రమే కలిగి వుంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరటి పండు, తేనెతో హెయిర్ మాస్క్‌తో హెయిర్ ఫాల్‌కు చెక్