పండగలకు పబ్బాలకు బాగా లాగిస్తున్నారా? ఐతే జాగ్రత్త..
పండగలకు పబ్బాలకు బాగా లాగిస్తున్నారా? పార్టీ సీజన్ కదా అని బాగా తినేస్తే.. ఊబకాయం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకలి లేనప్పుడు తినడం.. ఆకలి తీరాక మానేయకుండా అలాగే తినేయడం వంటివి చేస్తే ఆరోగ్యాని
పండగలకు పబ్బాలకు బాగా లాగిస్తున్నారా? పార్టీ సీజన్ కదా అని బాగా తినేస్తే.. ఊబకాయం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకలి లేనప్పుడు తినడం.. ఆకలి తీరాక మానేయకుండా అలాగే తినేయడం వంటివి చేస్తే ఆరోగ్యానికి కీడే జరుగుతుందంటున్నారు. ఆకలి తీరిందనగానే తినడం మానేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు.
కొన్ని ఆహార పదార్థాలు నోరూరిస్తాయి. అలాంటి వాటిని కొనడం మానేయండి. వాటికి బదులుగా సన్నబడేందుకు ఏదైనా ఆహారం ఉందేమో చూసుకోండి. బరువు తగ్గాలనుకునే వారు మొదట చేసే పని పూర్తిగా జంక్‌ఫుడ్‌ని మానేయడం మంచిది.
ఇంకా రోజులో ఎనభై శాతం పోషకాహారం, ఇరవైశాతం జంక్‌ఫుడ్‌ని ఎంచుకోండి. వీలైనంత వరకూ తక్కువ కెలొరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయడంతో పాటూ ధ్యానం కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.