Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు: భోజనానంతరం నీళ్ళు ఎక్కువగా తాగొద్దు!

Advertiesment
Health
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (09:56 IST)
మనిషి కాస్త బలహీనంగావుంటే రోగాలు చుట్టుముడుతుంటాయి. వాటిలో చిన్నచిన్నరోగాలైతే మరీనూ.. వాటినుంచి ఉపశమనం కలిగించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. శరీరంపై చెమట వున్నప్పుడే నీళ్ళుతాగడం, నీడన కూర్చుని ఎక్కువగా గాలి పీల్చడంవలన గుండె, తలలో నొప్పులు వస్తాయి. భోజనం చేసేటప్పుడు కాస్త మంచినీరు త్రాగండి. భోజనానంతరం నీళ్ళు ఎక్కువగా తాగకూడదు.
 
పగలంతా ఒకే చోట కూర్చుని పని చేసేవారు ఉదయం వాకింగ్ చేయాలి. ఒకరు తాగిన నీటిని(ఎంగిలి) మరొకరు తాగడంవలన టీబీ, దగ్గు మొదలైన జబ్బులు వచ్చే ప్రమాదంవుంది. తల్లిదండ్రుల రంగు నలుపుగావుంటే గర్భందాల్చిన స్త్రీ ఐదవ నెలనుంచి ప్రతి రోజు కమలా పండ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారని తెలిపారు. కడుపులో నీరు అధికంగావుంటే నిత్యం కొబ్బరినీరు తాగలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
మహిళలు నిత్యం ద్రాక్ష పండ్లు తీసుకోవాలి. మీ శ్వాసలో వాసన వస్తుంటే పెరుగులో నెయ్యికలిపి కొద్దిరోజులపాటు సేవించండి. చలినుండి కాపాడుకోవడానికి కలకండలో నిమ్మకాయ పిండుకుని తాగాలంటున్నారు వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu