మరమరాలు. స్నాక్ ఫుడ్‌గా దీన్ని పరిగణిస్తారు. ఐతే ఇందులో వున్న పోషకాలు, అవి ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మరమరాల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి కలుగుతుంది. మరమరాలు తింటుంటే అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి వాటిని నిరోధించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరమరాలు మేలు చేస్తాయి.
మరమరాల్లో విటమిన్ డి, విటమిన్ బిలతో పాటు ఐరన్ కంటెంట్ కూడా వుంటుంది. వీటిలో క్యాల్షియం వుండటం వల్ల బలమైన ఎముకలు, దంతాలు వుండేట్లు దోహదం చేస్తాయి. మరమరాలు మెదడు చురుకుదనాన్ని కలిగిస్తాయి, జ్ఞాపకశక్తిని పెంపొదిస్తాయి.