మునగాకును పాలతో నూరి మరిగించి తాగితే సుఖ వ్యాధులు మటుమాయం!
మునగ ఆకు అంటే చాలామందికి ఇష్టముండదు. అయితే మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మునగాకులో కడుపునొప్పి మంటలను తగ్గించే గుణాలున్నాయి. మూత్ర వ్యాధులకు నేత్రరోగాలకు బాగా ఇది పనిచేస్త
మునగ ఆకు అంటే చాలామందికి ఇష్టముండదు. అయితే మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మునగాకులో కడుపునొప్పి మంటలను తగ్గించే గుణాలున్నాయి. మూత్ర వ్యాధులకు నేత్రరోగాలకు బాగా ఇది పనిచేస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది. శరీరానికి మంచి మేలు చేస్తుంది.
మునగాకు వాతాన్ని కఫాన్ని హరించి శరీరానికి వేడి చేస్తుంది. ఆకలిని పెంచి కడుపులో క్రిములన హరిస్తుంది. ఈ చెట్టు ఆకు, కాయ, రెండూ బలాన్ని వీర్యవృద్ధిని కలిగిస్తాయి. దీని ఆకురసం, నూనెలూ యాంటి బాక్టీరియాల్‌గా పనిచేస్తాయి. మునగాకును పాలతో నూరి మరిగించి త్రాగితే మూత్రంలో మంట, రాయి, నొప్పి సుఖవ్యాధులు కూడా తగ్గిపోతాయి. మునగ చిగుళ్ళను దంచిరసం దీసి పంచదార కలుపుకుని త్రాగితే కొవ్వు కరిగి పోతుంది.
అంతేకాకుండా నెలసరి నొప్పిని ఈ రసం వెంటనే నివారిస్తుంది. వస, వాము, మునగాకు మూడింటిని నూరి బెణుకులు, వాపులు, నొప్పులు మాయమవుతాయి. మునగాకు రసాన్ని నూనెలో కలిపి వేడి చేసి చెవిలో వేస్తే చెవిపోటు వెంటనే తగ్గిపోతుంది. స్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె ఒక గ్లాసు లేత కొబ్బరికాయ నీటిలో కలిపి రోజుకు రెండు, మూడు సార్లు తాగుతుంటే కలరా, విరేచనాలు, కామెర్లు తగ్గిపోతాయి. అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, విరేచనాలు, కామెర్లకు, నేత్ర వ్యాధులకు, చర్మవ్యాధులకు, తలనొప్పికి నపుంసకత్వానికి, కలరా విరేచనాలకు, రేచీకటికి, శరీరంపై తగిలిన దెబ్బలకు మునగాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.