చెర్రీ పండ్లతో చెడు కొలెస్ట్రాల్‌ను తరిమేయవచ్చు...
చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకు
చెర్రీ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు మంచిగా ఉపయోగపడుతాయి. చెర్రీ పండ్లను తరచుగా తీసుకోవడం వలన రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ పండ్లను జ్యూస్ రూపంలో తీసుకుంటే అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు చెర్రీ పండు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. చెర్రీ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ సి శరీరంలోని కొవ్వును కరిగించుటకు ఉపయోగపడుతుంది. తద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.