Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చమక్కుమనిపించే 'చామంతి' టీ.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

సాధారణంగా తేయాకుతో తయారు చేసిన టీలతో పాటు గ్రీన్‌ల టీల గురించే ఎక్కువగా తెలుసు. కానీ, ఇపుడు చామంతి టీ కూడా అందుబాటులోకి వచ్చింది.

Advertiesment
chamanthi flower Tea
, బుధవారం, 20 జులై 2016 (14:50 IST)
సాధారణంగా తేయాకుతో తయారు చేసిన టీలతో పాటు గ్రీన్‌ల టీల గురించే ఎక్కువగా తెలుసు. కానీ, ఇపుడు చామంతి టీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చామంతి పూల తేనీరు సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు చెపుతున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
నిద్రలేమి, పని ఒత్తిడి... ఇతరాత్రా కారణాలు కళ్లకింద వాపు వస్తుంది. ఇలాంటప్పుడు చామంతి టీ బ్యాగులని ఫ్రిజ్‌లో ఉంచి మూసిన కనురెప్పలపై ఉంచినట్టయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చట. కంటి అలసటనూ తగ్గిస్తుందట. కంటికింద ఏర్పడే నల్లటి వలయాలూ దూరమవుతాయట.
 
చామంతి టీని ముఖానికి రాసుకుని కొద్దిసేపు ఆరబెట్టడం వల్ల వడలిన చర్మం తక్షణ ఉపశమనం పొందేలా చేస్తుందట. దీనిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లూ, చర్మగ్రంథుల లోపలివరకూ చొచ్చుకునిపోయి శుభ్రం చేస్తాయి. చర్మం తాజాగానూ ఉంటుంది. అంతేనా కాలిన గాయాలు, దోమకాటు వల్ల వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.
 
చర్మంపై పేరుకున్న టాన్‌ ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తుంది. చామంతి టీని రోజూ ముఖానికి రాసుకుంటే సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌లా ఉపయోగపడుతుంది. ఇది చర్మ ఛాయను మెరుగుపరిచి వన్నెలీనేలా చేస్తుందట. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఫలితంగా ముఖంపై ఏర్పడే మచ్చలు వంటివి తగ్గుముఖం పడతాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్ధాప్యంలో స్త్రీపురుషులకు వచ్చే వ్యాధులేంటి?