Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీటిలో అర టీ స్పూన్ అల్లం వేసుకుని తాగితే?

Advertiesment
Ginger
, బుధవారం, 6 ఏప్రియల్ 2016 (09:48 IST)
ఒక కప్పు నీటిలో అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులు వేసి 10 నిమిషాల పాటు మరిగించి దింపాలి. చల్లారిన తర్వాత ఈ కషాయాన్ని తాగితే గొంతులో గరగర పోతుంది. రెండు టీ స్పూన్‌ల నువ్వుల నూనెలో ఒక కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు తాగితే నెలసరి క్రమబద్ధం అవుతుంది.
 
కొన్ని తులసి ఆకులని దంచి రసం తీయాలి. ముఖం మీద గాని, చేతుల మీదగానీ ఏర్పడిన తెల్ల మచ్చలపై ఈ రసాన్ని రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు మెల్లి మెల్లిగా తగ్గుముఖం పడతాయి. మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు వేయాలి. 
 
నాలుగు మిరియాలను పొడిగా చేసి ఇందులో కలపాలి. అన్నీ కలిపి 15 నిమిషాలపాటు మరగబెట్టి దింపేయాలి. ఇందులో టీ స్పూన్ తేనె కలుపుకుని ఉదయం, సాయంత్రం తాగాలి. ఈ కషాయం తాగడం వల్ల పొడి దగ్గు తగ్గడమే కాకుండా ఛాతీలో పట్టినటుగా ఉన్నా కూడా ఉపశమనం లభిస్తుంది.
 
కప్పు నీటిలో మూడు మల్బరీ ఆకులను వేసి పది నిమిషాల పాటు మరగబెట్టి దింపి చల్లార్చాలి. ఇందులో కోడిగుడ్డులోని తెల్ల సొన కలుపుకుని తాగాలి. దీర్ఘకాలంగా బాధిస్తున్న దగ్గు తగ్గుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu