వేసవికాలంలో చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు కొబ్బరినూనెలో నిమ్మరసం పిండి గోరువెచ్చగా చేసి తలకు బాగా పట్టించాలి. నూనె పట్టించేటప్పుడు మాడుకు బాగా అంటేలా చూసుకోవాలి. అరగంట అలాగే ఉంచాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
గోరువెచ్చని నూనెతో రాత్రిళపూట హెడ్ మసాజ్ చేసి, ఉదయాన్నే పెరుగులో మెంతిపొడిని కలిపి తలకు బాగా అప్లై చేసి ఆరాక తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది. వారానికోసారి హెడ్ మసాజ్ చేయించుకుని తలను శుభ్రం చేసుకుంటే చుండ్రు సమస్య తగ్గి జుట్టు నిగనిగ లాడుతుంది.
హెడ్ మసాజ్ చేయటం వల్ల ఉపయోగాలేంటంటే.. హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల అలసిన కళ్ళు రిలాక్స్ అవుతాయి. కళ్ళ మంటలు, తలనొప్పి తగ్గుతుంది. మసాజ్ మూలంగా రక్తప్రసరణ బాగా జరిగి, స్వేదరంధ్రాలు తెరచుకుని వెంట్రుకలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అంతేగాకుండా మాడుకు చలువ చేస్తుంది.