Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషులు గరికను దానితో తీసుకుంటే శృంగారంలో....

Advertiesment
Grass
, శనివారం, 20 అక్టోబరు 2018 (16:12 IST)
ప్రకృతి జంతువులకు, మానవులకు కావలసనివన్నీ ఇచ్చింది. కాకపోతే వేటిలో ఏమేమి వున్నదనే విషయాలను తెలుసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు సహజమైన ప్రకృతి వనరుల ద్వారా నివారించుకోవచ్చు. చాలామంది సంతానలేమితో ఇబ్బందిపడుతుంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ సహజసిద్ధంగా లభించేవాటి జోలికి వెళ్లరు. ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలున్నాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... గరికను గడ్డి పరకే కదా అని తీసివేస్తుంటారు చాలామంది. కానీ ఈ గరిక ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో ఉంది. వీర్యవృద్ధిలేమితో సతమతమయ్యేవారు గరికను శుభ్రంగా కడిగి ఒక లీటరు నీళ్లలో ఉడికించి అది పావు లీటరు అయ్యే దాకా ఉంచి వడగట్టి దానికి పాలు, బెల్లం కలిపి తాగితే వీర్యవృద్ధి కలుగుతుంది. 
 
అదేవిధంగా గరిక రసానికి కొద్దిగా కొబ్బరినూనె చేర్చి కాలిన గాయాలకు రాస్తే త్వరగా మానిపోతాయి. గజ్జి, దద్దుర్లు మొదలైన చర్మ రోగాలకు రోజుకు రెండుసార్లు గరికరసం, పసుపుతో కలిపి రాస్తే త్వరగా తగ్గుతుంది. 
 
మూలవ్యాధి ఉన్నవారు రోజుకు రెండు లేదా మూడుసార్లు మూడు చెంచాల చొప్పున గరిక రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. వాంతులయ్యేవారు గరిక రసంలో కొద్దిగా బియ్యం కడిగిన నీటితో కలిపి తాగాలి. ఉపశమనం కలుగుతుంది. చూశారా గరికితో ఎన్ని ఉపయోగాలో...!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారింజలో కంటే క్యాబేజిలో అది ఎక్కువ?