Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లం చేసే మేలెంతో తెలుసా?

త్రిదోషాలైన వాత, పైత్య, శ్మేష్మాలను హరించే శక్తి అల్లానికి ఉంది అల్లం నోటికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా కడపు నొప్పిని సైతం తగ్గిస్తుంది. దగ్గును, పాండురోగాలను కూడా నివారిస్తుంది. ముఖ్యంగా జీర్ణకారిగా ఎంతగానో ఉపయోగపపడుతుంది.

Advertiesment
అల్లం చేసే మేలెంతో తెలుసా?
, మంగళవారం, 16 మే 2017 (19:39 IST)
త్రిదోషాలైన వాత, పైత్య, శ్మేష్మాలను హరించే శక్తి అల్లానికి ఉంది అల్లం నోటికి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా కడపు నొప్పిని సైతం తగ్గిస్తుంది. దగ్గును, పాండురోగాలను కూడా నివారిస్తుంది. ముఖ్యంగా జీర్ణకారిగా ఎంతగానో ఉపయోగపపడుతుంది. 
 
కడుపు అజీర్ణం చేసినట్టయితే, గ్లాసు మంచినీళ్ళలో ఒక నిమ్మకాయ రసం పిండి అందులో మూడు టీ స్పూన్ల అల్లం రసం పిండి తాగినట్టయితే ఎలాంటి అజీర్ణమైనా పోతుందంటారు. అల్లం, బెల్లం కలిపి ఆరగించినట్టయితే అరికాళ్ళపై పొరలు ఊడటం, కొద్దికొద్దిగా విరేచనాలు తగ్గటం జరుగుతుంది. 
 
ఈ అల్లం ఇలాంటి వంటింటి వైద్యాలకు మాత్రమే కాకుండా, శుభకార్యాలలో కూడా వినియోగిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. శుభకార్యాలలో చేసే పిండి వంటలు, రకరకాల కూరలు, నూనె, నెయ్యి పదార్థాలు తిని అతి దాహంతో, పైత్యంతో వికారం కలిగి అజీర్తి పాలిట పడకుండా ఈ అల్లం పచ్చడి కాపాడుతుందనే నమ్మకం ఉంది. ముఖ్యంగా మలబద్దకాన్ని పోగొట్టి మూత్రం ధారాళం1గా పోయేందుకు దోహదపడుతుందట. 
 
అలాగే, మూడు చెంచాల అల్లం రసం, మూడు చెంచాల వంటాముదం కలిపి తాగినట్టయితే, రక్త గ్రహణి, బంక విరేచనాలు తగ్గుతాయట. దీర్ఘవాత రోగాలతో బాధపడేవాళ్లు ప్రతి రోజూ పల్చని మజ్జిగలో అల్లం రసం కలిపి మూడు పూటలా తాగినట్టయితే కీళ్ళవాతం కటివాతం, గృధ్రసివాతం మొదలగు వాతాలకు ఉపశమనం కలుగుతుందట. 
 
అలాగే, ఒక గ్లాసు మంచినీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, దానిలో రెండు చెంచాల ధనియాల రసం కలిపి ఉదయం పూట మాత్రం తీసుకుంటే పది, పదిహేను రోజుల్లో రక్తపోటు తగ్గుముఖం పడుతుందట. అంతేకాకుండా గుండెదడ, అలసట, వికారాన్ని పోగొట్టి గుండెకు బలం ఇస్తుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగికంగా ముగ్గురు వేధిస్తున్నారు... ఆత్మహత్య చేసుకోబోయి అమ్మను కాల్చి చంపేశా...