Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెల్లుల్లి, తేనెల మిశ్రమాన్ని పరగడుపునే తీసుకోండి... అబ్బ అద్భుతాలే

వెల్లుల్లి, తేనె క‌లిపి మిశ్ర‌మంగా వాడితే... వారం లోపు అద్భుత‌మైన ఫలితాలుంటాయి. వెల్లుల్లి, తేనె రెండూ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దీనివల్ల మన శరీరం ఎలాంటి వ్యాధినైనా తట్టుకోగలిగే విధంగా రూపుదిద్దుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత పట

వెల్లుల్లి, తేనెల మిశ్రమాన్ని పరగడుపునే తీసుకోండి... అబ్బ అద్భుతాలే
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (23:14 IST)
వెల్లుల్లి, తేనె క‌లిపి మిశ్ర‌మంగా వాడితే... వారం లోపు అద్భుత‌మైన ఫలితాలుంటాయి. వెల్లుల్లి, తేనె రెండూ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దీనివల్ల మన శరీరం ఎలాంటి వ్యాధినైనా తట్టుకోగలిగే విధంగా రూపుదిద్దుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. ప్రధానంగా బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. 
 
యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి. శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. 
 
తయారీవిధానం:-
ఓ చిన్నపాటి జార్‌ను తీసుకుని అందులో సగం వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రేకుల్ని నింపాలి.
తరువాత ఆ వెల్లుల్లి రేకులు మునిగిపోయే వరకు అందులో తేనె పోయాలి.
ఆ తరువాత జార్‌కు మూత పెట్టి పొడి వాతావరణంలో 2 వారాల పాటు అలాగే ఉంచాలి.
రెండు రోజులకు ఒకసారి జార్ మూత తీసి అందులోని మిశ్రమాన్ని కలపాలి.
2 వారాల అనంతరం ఆ మిశ్రమాన్ని వాడుకోవాలి.
నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమాన్ని సేవించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురక తగ్గాలంటే.. పిప్పర్‌మెంట్.. యాలకుల చూర్ణం.. ట్రై చేయండి గురూ...