మీ పాదాలు నూనెతో మర్దనా చేయండి... అంతా సెట్ అయిపోతుంది...
మీకు చిరాకుగా ఉందా? ఒంట్లో తిక్కతిక్కగా ఉందా? బాగా అలసటగా ఉందా... అయితే, ఓ చిన్న చిట్కా... మీరు చేయాల్సిందల్లా... మీ చెప్పులో, బూట్లో విప్పి... పాదాలను శుభ్రంగా గోరు వెచ్చని నీటితో కడుగుక్కోండి. పొడి తువాలుతో కాళ్ళను పూర్తిగా తుడుచుకోండి. మ
మీకు చిరాకుగా ఉందా? ఒంట్లో తిక్కతిక్కగా ఉందా? బాగా అలసటగా ఉందా... అయితే, ఓ చిన్న చిట్కా... మీరు చేయాల్సిందల్లా... మీ చెప్పులో, బూట్లో విప్పి... పాదాలను శుభ్రంగా గోరు వెచ్చని నీటితో కడుగుక్కోండి. పొడి తువాలుతో కాళ్ళను పూర్తిగా తుడుచుకోండి. మంచంపై వెల్లకిలా పడుకుని పాదాలను ఎవరితోనైనా మర్దనా చేయించుకోండి.
మీ పాదాలలో శరీరపు భాగాలన్నిటి కీలక నరాలు ఉంటాయి. అందుకే మన పాదాలను ఎలా పడితే అలా ఉంచేయడానికి వీలు లేదు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాదు... అప్పుడపుడూ పాదాలను నూనె, లేదా క్రీంతో బాగా మర్ధనం చేస్తే శరీరం అంతా ఎంతో తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర లేమి ఉన్నవారికి వెంటనే నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. అయినా అరికాలును మాత్రం సునిశితంగా మర్ధన చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకుంటే హాయిగా ఉంటుంది. నూనె కాళ్ళతో నడిచేటపుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త... జారిపడతారు.