Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపుతో అరికాళ్ళకు రాసుకుంటే...

కాళ్ళతో సంబంధం లేకుండా వేధించే అనారోగ్య సమస్యల్లో పాదాల పగుళ్ళు ఒకటి. నీటిలో ఎక్కువగా తడవడం, అలాగే పాదాలకు ఎక్కువగా తేమ లేకపోవడం, మురికి ఎక్కువగా చేరడం వల్ల పాదాల పగళ్ళు సమస్యలకు కారణాలు. పగుళ్ళు వచ్చ

Advertiesment
ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపుతో అరికాళ్ళకు రాసుకుంటే...
, బుధవారం, 1 నవంబరు 2017 (21:19 IST)
కాళ్ళతో సంబంధం లేకుండా వేధించే అనారోగ్య సమస్యల్లో పాదాల పగుళ్ళు ఒకటి. నీటిలో ఎక్కువగా తడవడం, అలాగే పాదాలకు ఎక్కువగా తేమ లేకపోవడం, మురికి ఎక్కువగా చేరడం వల్ల పాదాల పగళ్ళు సమస్యలకు కారణాలు. పగుళ్ళు వచ్చినప్పుడు నడవడం ఇబ్బందిగా ఉండడమే కాకుండా చీము, నెత్తురు కూడా వస్తుంటుంది. ఈ సమస్యను చాలా ఈజీగా అధిగమించవచ్చు.
 
కొవ్వొత్తి మైనాన్ని ఆవునూనెతో కలిపి పడుకునేటప్పుడు కాళ్ళకు రాసుకోవాలి. అలా రాసుకుంటే ఉదయం లేచేసరికి మంచి ఫలితం ఉంటుంది. పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు కలిపి పగిలిన పాదాలపై మర్థనా చేసి 10నిమిషాల పాటు ఉంచాలి. ఆ తరువాత వైట్ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పగుళ్ళ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
 
శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు పాదాలు పగుళుతూ ఉంటాయి. అలాంటప్పుడు గోరింటాకును నూరి పగుళ్ళకు రాసుకుని శుభ్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గోరింటాకు శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ప్రతిరోజు నువ్వుల నూనెను రాసుకోవాలి, అలాగే అరటిపండు గుజ్జును కూడా రాయాలి. 
 
పసుపు, తులసి, కర్పూరాలను సమాన మోతాదులో తీసుకొని వీటికి అలొవేరా జెల్ కలిపి రాయడం వల్ల పగుళ్ళ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి అందులో పాదాలను పదినిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం రోస్ వాటర్‌ను కాళ్ళపై పోసి మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో... తలకు నూనె ఇలా పెడుతున్నారా...