సెల్ ఫోన్, కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా?: చేతివేళ్లు భద్రం గురూ...
కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టెక్నాలజీ సాకుతో ఉదయం లేచిన వద్ద నుంచి రాత్రి నిద్రించేంత వరకు.. స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. సెల్
కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టెక్నాలజీ సాకుతో ఉదయం లేచిన వద్ద నుంచి రాత్రి నిద్రించేంత వరకు.. స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్‌తో పాటు కంప్యూటర్లను అత్యధికంగా ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వీటి వాడకం ద్వారా కంటి సమస్యలు తప్పవ్.
అయితే వీటిని ఉపయోగిస్తే కంటితో పాటు చేతి వేళ్లకు కూడా దెబ్బేనని తెలుసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెల్ ఫోన్‌ను అదేపనిగా చూస్తుండటం, చేతివేళ్లతో ఛాటింగ్ చేస్తుండటం.. అలాగే కంప్యూటర్లో మౌస్, కీబోర్డులను అదే పనిగా ఉపయోగించడం ద్వారా చేతి వేళ్ళలో నొప్పి ప్రారంభం అవుతుంది. ఈ నొప్పి నుంచి చేతివేళ్ళకు ఉపశమనం లభించాలంటే? చేతివేళ్లలో నొప్పి వున్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్ పెట్టాలి.
చేతి వేళ్ల నొప్పిని తగ్గేందుకు కొన్ని వ్యాయామాలు చేయాలి. మణికట్టు ప్రాంతంలో నొప్పి వున్నట్లైతే చేతికి స్మైలీ బాల్‌ను నొక్కుతూ వుంటే సరిపోతుంది. ఇలా చేసినా నొప్పి తగ్గలేదంటే.. వెంటనే ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి. క్యాల్షియంతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోజూ అరగంట నడవడం చేతుల్ని తిప్పే వ్యాయామాలు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.