ఐ డ్రాప్స్... ట్యాబ్లెట్స్ ఎలా పడితే అలా వాడేయొద్దు!
తలనొప్పిగా ఉందంటే ఇంట్లో ఉన్న ఏదో పాత ట్యాబ్లెట్ వేసేసుకోవడం... కంటిలో దుమ్ము, నలక పడిందంటే... పాత ఐడ్రాప్స్ బాటిల్ తీసుకుని కంట్లో వేసుకోవడం... చేసేస్తుంటాం. కానీ, అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దంటున్నారు వైద్య నిపుణులు. దీనివల్ల హానికరమై
తలనొప్పిగా ఉందంటే ఇంట్లో ఉన్న ఏదో పాత ట్యాబ్లెట్ వేసేసుకోవడం... కంటిలో దుమ్ము, నలక పడిందంటే... పాత ఐడ్రాప్స్ బాటిల్ తీసుకుని కంట్లో వేసుకోవడం... చేసేస్తుంటాం. కానీ, అలా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దంటున్నారు వైద్య నిపుణులు. దీనివల్ల హానికరమైన ప్రభావాలుంటాయని చెపుతున్నారు.
- కంటిలో దుమ్ము ధూళి పడిందని, ఇంట్లో ఉన్న పాత ఐడ్రాప్స్ వాడితే...కంటి చూపుపై దుష్ప్రభావం చూపుతుంది. కంటి వైద్యుడి సూచనల మేరకు ఐడ్రాప్స్ వాడాలి గాని సొంత నిర్ణయాలు పనికిరావు.
- పరగడుపునే ఏమీ తినకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకోరాదు. నిరాహారంగా యాంటి బయోటిక్స్ కూడా వాడరాదు. అలా వేసుకుంటే శరీరంలో కాలేయం, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
- ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని, ప్రతిసారి ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడితే, అది కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా మంచి నీళ్ళతోనే వేసుకోవడం ఉత్తమం. కాఫీ, టీ, కూల్ డ్రింకులతో వేసుకుంటే అది పనిచేయకపోగా, హానిచేసే అవకాశం ఉంది.