Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రై స్కిన్‌కు చెక్ పెట్టే కీరదోస, కలబంద!

Advertiesment
Dry Skin
, గురువారం, 7 ఏప్రియల్ 2016 (09:42 IST)
స్కిన్ కేర్‌గా కీరదోస, కలబందను చెప్పవచ్చు. డ్రై స్కిన్ సమస్య నివారించడంలో కలబంద నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది డ్రై, డ్యామేజ్ స్కిన్‌ని నివారిస్తుంది. ఇది చర్మానికి కాంతినిస్తుంది. వేసవిలో ముఖానికి, చేతులకు అలోవెరా జెల్‌ను అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ తగ్గిపోతుంది. అలాగే కీరదోస కాయ డ్రై స్కిన్ నివారిచడానికి తగినంత తేమను అందిస్తుంది. 
 
బొప్పాయిలో యాంటీయాక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని టాక్సిన్స్ నివారించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. ఇంకా డ్యామేజ్ స్కిన్‌ని నివారిస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. బొప్పాయిని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా మెరిసే చర్మ ఛాయను పొందవచ్చు.  
 
కీరదోసకాయలో ఉండే నీరు పొడిబారిన చర్మానికి పోషణను అందిస్తుంది. దాంతో స్కిన్ సమస్యలు దూరమవుతాయి. ఇది చర్మంలోనికి చొచ్చుకొని పోయి, స్కిన్ సెల్స్‌కు అవసరం అయ్యే మాయిశ్చరైజర్‌ను అందిస్తాయి. మిక్సీలో కీరదోసకాయ ముక్కలు వేసి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా డ్రై స్కిన్‌కు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu