Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిక్కర్ తాగడం తగ్గించండి.. గుండెజబ్బుల్ని పారద్రోలండి..!

Advertiesment
Drinks
, బుధవారం, 21 అక్టోబరు 2015 (17:42 IST)
లిక్కర్ తాగడం తగ్గించండి.. గుండెజబ్బుల్ని పారద్రోలండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు యుక్తవయస్సులోనే మితిమీరి లిక్కర్ తీసుకుంటే గుండెజబ్బులు, పక్షవాతం సోకే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జబ్బులు యుక్తవయస్సులోనే పొడసూపుతుందని... వృద్ధులతో సమానంగా యువకుల్లోనూ ఈ బెడద ఉంటుందని శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనం ద్వారా అభిప్రాయపడుతున్నారు.
 
ఇలియానియస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. యుక్తవయసులోనే అతిగా మద్యం తాగే అలవాటు ఉంటే.. అధిక రక్తపోటు, కొవ్వుశాతం పెరగడం వంటివి కూడా ఎక్కువగా ఉండి.. గుండెజబ్బులకు, పక్షవాతానికి దారి తీస్తాయట. 
 
అతి మద్యం తాగే యువతరంలో రక్తప్రసరణను నియంత్రించే రెండు కీలక కణాలు పూర్తిగా దెబ్బతినడం వలన.. ఇలా జరుగుతుందిట. ఇది క్రమంగా ధమనుల్ని క్షీణింపజేస్తుందని.. అందువల్లనే హృద్రోగాలు వస్తాయని పరిశోధనలో వెల్లడైంది.

Share this Story:

Follow Webdunia telugu