Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

చాలామంది భోజనం ఆరగించిన వెంటనే ఓ చెంబుడు నీళ్లు గటగటా తాగేస్తుంటారు. మరికొందరు ఓ గ్లాసు తాగుతారు. నిజానికి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగరాదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రతిరోజు కనీసం 3 లీటర్ల

అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?
, గురువారం, 25 మే 2017 (09:52 IST)
చాలామంది భోజనం ఆరగించిన వెంటనే ఓ చెంబుడు నీళ్లు గటగటా తాగేస్తుంటారు. మరికొందరు ఓ గ్లాసు తాగుతారు. నిజానికి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగరాదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు మాటగా ఉంది. అయితే, భోజనం పూర్తి కాగానే ఫుల్‌గా నీళ్లు తాగరాదని సూచిస్తున్నారు. భోజనం పూర్తయిన అరగంట తర్వాత నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది.
 
ఇకపోతే.. చాలా మందిని అజీర్తి సమస్య వేధిస్తుంది. తేన్పులు, పొట్ట ఉబ్బరం ఎక్కువుగా ఉంటుంది. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. అలాగే, పనిలో ఒత్తిడి కారణంగా భోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. సమయానికి భోజనం చేయకపోతే శరీరం కొవ్వును నిలువ చేసుకుంటుంది. అంతేకాకుండా సమయం తప్పిన తర్వాత తిన్నట్లయితే ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి భోజనం తప్పకుండా చేయాలి. 
 
పీచుపదార్థాలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. పొట్ట నిండిన ఫీలింగ్‌ రావడానికి, జీర్ణక్రియ బాగా జరగడానికి పీచుపదార్థాలు బాగా ఉపయోగపడతాయు. తాజా పండ్లు, నట్స్‌, ఆకుకూరలు ఎక్కువగా తినండి. మసాలాలు, వేయించిన పదార్థాలు, వెన్నతో చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే అజీర్తి సమస్య నుంచి విముక్తిపొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవనూనెను వాడండి.. బానపొట్టను తగ్గించుకోండి..