Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తక్షణ శక్తినిచ్చే ఆహారం ఏమిటో తెలుసా?

తక్షణ శక్తినిచ్చే ఆహారం ఏమిటో తెలుసా?
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (21:12 IST)
పనిలో అలసటను చాలామంది అనుభవిస్తుంటారు. అలాగే నీరసంతో కూలబడుతుంటారు. పని చేసేటపుడు తినడం కూడా మానేసి పనులు చేస్తారు ఇంకొందరు. ఇలాంటివారు శరీరంలో శక్తిని కోల్పోయి నీరసిస్తుంటారు. అప్పుడు తక్షణ శక్తి అందాలంటే ఈ పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
 
1. కప్పు ఓట్‌మీల్‌ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్‍‌మీల్ లోని పీచు.. ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీ ఉత్సాహానికి ఊపునిస్తాయి. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు.
 
2. చాలాసార్లు మనకు తెలియకుండానే పనిలో పడి గ్లాసు మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల మంచి నీళ్లు కూడా తాగకుండా ఉండిపోతాం. దానివల్ల డిహైడ్రేషన్ తలెత్తుతుంది. ఫలితంగా చెప్పలేని నీరసం. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే ఒక గ్లాసుడు చల్లని మంచినీటిని తాగండి. శక్తి పుంజుకొంటుంది. ఆ నీటిలో కొద్దిగా పంచదార కానీ ఉప్పు కానీ వేసుకుంటే శరీరం కోల్పోయిన లవణాలు తిరిగి అందుతాయి. లేదా గ్లాసుడు పండ్లరసం... బత్తాయి, నారింజ వంటి రసాలు తాగితే మరీ మంచిది. వీటిలో ఉండే ఎ, సి, బి1 విటమిన్లకు మిమ్మల్ని హుషారుగా ఉంచే శక్తి ఉంది.
 
3. పెరుగు.. ఇది తక్షణ శక్తినందిస్తుంది. ఇందులోని సహజ చక్కెరలు అలసిన మనసుకి ఉత్సాహాన్నిస్తాయి. ఇక పెరుగులోని మాంసకృత్తులు క్రమంగా శక్తినందిస్తూ ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడేట్టు చేస్తాయి. దీనిలోని ప్రొ బయోటిక్ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జలుబులో బాధపడుతుంటే ఆ చికాకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని భోజనంలోనే కాకుండా.. రోజులో ఒకసారైనా అరకప్పు తీసుకుంటే మంచిది.
 
4. ఎండుద్రాక్ష, వాల్‌నట్లు, బాదం, అవిసెగింజల్లోని కొవ్వులు శరీరానికి మేలు చేస్తాయి. వీటిలోని అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా త్వరగా శక్తిని విడుదల చేస్తాయి. ఆఫీసు నుంచి అలసిపోయి వస్తే.. ఇవి గుప్పెడు తిని చూడండి. ఇవి చక్కని అల్పాహారం కూడా.
 
5. రోజువారీ ఆహారంలో ఇనుము ఉండేలా చూసుకొంటే మాటిమాటికీ నిస్సత్తువ ఆవరించదు. పాలకూర, తోటకూర వంటివాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. నిస్సత్తువ ఆవరించదు. పాలకూర, తోటకూర వంటివాటిలో ఇనుము సమృద్ధిగా అందుతుంది. నిస్సత్తువకు మరోకారణమైన రక్తహీనత సమస్య కూడా బాధించదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని నూనెల్లోకెల్లా నువ్వుల నూనె శ్రేష్ఠమైనదని ఎందుకంటారో తెలుసా?