అది రోజుకి ఒక్క గ్రాము తీసుకుంటే చాలు... అలాంటి పురుషులకు శక్తి...
మెంతులు గురించి తెలుసు కానీ, ఔషధపరంగా అది చేసే మేలు చాలామందికి తెలియదు. ఇవి నీళ్ల విరేచనాలను తగ్గిస్తాయి. కాలేయము, వీపులో పుట్టే నొప్పులను తగ్గిస్తాయి. స్త్రీలకు రుతురక్తాన్ని ఎక్కువగా జారీ చేస్తుంది. నెమ్మును హరించి దగ్గును తగ్గిస్తుంది.

ముల్లు విరిగి శరీరంలోనే ఉన్నప్పుడు మెంతి పిండిని దానిపై పట్టుగా వేస్తే ముల్లు సులభంగా బయటకు వస్తుంది. పచ్చి మెంతులు ఒక నెల రోజులపాటు ఒక్క గ్రాముకు మించకుండా వాడితే పురుషుల్లో వీర్యవృద్ధి కలుగుతుంది. మెంతులు తీసుకుంటే గొంతు బొంగురుపోవడం తగ్గుతుంది.
మెంతులను పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి పంచదార కలిపి లేహ్యంగా వండి రోజూ రెండు నుంచి 5 గ్రాములు వరకూ తింటే స్వప్న స్ఖలనము, మూత్రంలో వీర్యం పోవడం తదితర సమస్యలు తగ్గిపోతాయి. ఐతే మెంతులను ఎక్కువగా వాడితే పైత్య వికారాలు కలుగుతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కాబట్టి మోతాదుకు మించి వాడకూడదు.