Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాక్లెట్స్ తినండి... హృదయ వ్యాధులకు దూరంగా ఉండడండి...

చాక్లెట్స్ తీసుకుంటే గుండె జబ్బులు దరిదాపులకు కూడా రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పక్షవాతం రాకుండా ఉండడానికి చాక్లెట్స్ చాలా ఉపయోగపడుతాయి. ఈ మాటలు సాధాసీదా వ్యక్తులు చెప్పేవి కావు. స్కాట్ లాండ్

Advertiesment
చాక్లెట్స్ తినండి... హృదయ వ్యాధులకు దూరంగా ఉండడండి...
, శుక్రవారం, 29 జూన్ 2018 (11:00 IST)
చాక్లెట్స్ తీసుకుంటే గుండె జబ్బులు దరిదాపులకు కూడా రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పక్షవాతం రాకుండా ఉండడానికి చాక్లెట్స్ చాలా ఉపయోగపడుతాయి. ఈ మాటలు సాధాసీదా వ్యక్తులు చెప్పేవి కావు. స్కాట్ లాండ్ పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అస్సలు ఆ చాక్లెట్లలో ఏముంటుంది? వాటి వివారాలను తెలుసుకుందాం.
 
చాక్లెట్ తినేవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం 11 శాతం తక్కువగా ఉంటుంది. ఈ జబ్బుల ద్వారా మరణించే అవకాశం 25 శాతం తగ్గుతుందని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. చాక్లెట్స్‌కు, గుండె సమస్యలకు ఉన్న సంబంధాన్ని పరిశోధకులు అధ్యయనంలో తెలియజేశారు. 21 వేల మంది పన్నెండేళ్ల పాటు అధ్యయనం జరిపి ఈ ఫలితాలు కనుగొన్నారు. రోజుకు 100 గ్రాముల వరకు డార్క్, మిల్క్ చాక్లెట్స్ తిన్నవారికి హృదయ సంబంధిత సమస్య తొలగిపోయే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాహం... దాహం... ఎందుకు? చల్లటి మజ్జిగతో.....