Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాకర కాయతో ఆరోగ్యం... కాయ పండితే మాత్రం..?!!

కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకు ఉంది. కాకర రసాన్ని బాధిస్తున్న కీలు మీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి. 1. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు ఉంది. 2. షుగర్‌ వ్యాధి గలవార

Advertiesment
Bitter gourd
, గురువారం, 5 మే 2016 (15:40 IST)
కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకు ఉంది. కాకర రసాన్ని బాధిస్తున్న కీలు మీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.
1. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు ఉంది.
2. షుగర్‌ వ్యాధి గలవారు రెండు మూడు నెలల పాటు వరుసగా కాకర ర‌సం తీసుకోవాలి. కాకరను ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది.
3. కడుపులో పరాన్నజీవులు చేరటం వల్ల పలు రకాల ఇబ్బందులను కాకర పసరు తొలగిస్తుంది. 
 
4. మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకోవాలి.
5. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా మార‌తాయి. అటువంటి పచ్చదనం కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి.
6. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు. కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు.
7. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజ్ వాటర్ తయారీ ఎలా చేసుకోవాలో తెలుసా...?