పుట్టుకతో వచ్చే లోపాలను ఆ పప్పులతో చెక్ పెట్టొచ్చు!
చాలా మంది వివిధ రకాల లోపాలతోనే జన్మిస్తుంటారు. ఇలాంటి లోపాలను నానబెట్టిన బాదం పప్పులతో కొంతమేరకైనా నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పప్పుల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే
చాలా మంది వివిధ రకాల లోపాలతోనే జన్మిస్తుంటారు. ఇలాంటి లోపాలను నానబెట్టిన బాదం పప్పులతో కొంతమేరకైనా నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పప్పుల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను చక్కబెట్టడంలో ఓ మందులా పని చేస్తుందట.
నీళ్లలో నానబెట్టిన బాదం పప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మరింత పదిలంగా ఉంటుందట. ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు 6-8 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. వాటిని ఒక ప్లాస్టిక్ కవరులో స్టోర్ చేయాలి. అలా వాటిని దాదాపు ఒక వారం రోజుల పాటు వీటిని తినవచ్చు. నానబెట్టిన బాదం పప్పును ఆరగించడం వల్లే అనేక లాభాలు కలుగుతాయి.
ఈ పప్పును ఆరగించడం వల్ల పుట్టుకతో వచ్చే లాభాలతో పాటు.. జీర్ణక్రియ సమర్థవంతంగా జరుగుతుంది, అధిక బరువును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా దోహదం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కేన్సర్ వ్యాధిని దరిచేరనీయకుండా ఉంచుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది.