Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే..?

పైకి చూసేందుకు ఆకుపచ్చగా ఉన్న లోపలంతా చూడచక్కని ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయ అందరికీ ఇష్టమే. వేసవి కాలంలోనే కాదు సాధారణ కాలంలో దొరికే పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే..?
, గురువారం, 15 జూన్ 2017 (12:28 IST)
పైకి చూసేందుకు ఆకుపచ్చగా ఉన్న లోపలంతా చూడచక్కని ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయ అందరికీ ఇష్టమే. వేసవి కాలంలోనే కాదు సాధారణ కాలంలో దొరికే పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. కానీ చాలామంది పుచ్చకాయ కోసుకుని అందులోని గుజ్జును మాత్రం తిని గింజలను పడేస్తుంటారు. కొంతమందైతే ఆ గింజలు తగిలితే చాలు ఏదో తెలియని చికాకులాగా మూసేస్తుంటారు. కానీ ఆ పుచ్చకాయల్లోని గింజల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయట. అంతేకాదు ఆ గింజలు అనారోగ్యాలను కూడా దూరం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
 
పుచ్చవిత్తనాల్లో విటమిన్-డి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రోటీన్స్, హెల్తీప్యాక్ట్ కూడా అధికంగా ఉంటాయి. పుచ్చకాయ విత్తనాలు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చగింజల్లో కూడా ఫైబర్ జీర్ణక్రియల్లో ఉండే క్రిములను చంపేస్తుంది. పచ్చకామెర్ల రాకుండా కాపాడుతుంది. అలాగే మూత్ర సంబంధిత ఇనెఫెక్షన్లు కూడా దూరమవుతుంది. అంతేకాదు పుచ్చవిత్తనాలతో చేసిన టీని కొద్దికాలం పాటు క్రమం తప్పకుండా తాగితే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి. 
 
వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రక్తనాళాలను సరఫరా చేసి రక్తనాళాలను మెరుగుపరచడంలో ప్రధానపాత్రను పోషిస్తాయి. జ్ఞాపకశక్తి, కండరాల కదలికలకు బాగా పనిచేస్తాయి. పుచ్చకాయ గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పొడిని తీసుకుని రెండు లీటర్ల నీటిలో పోసి 10 నిమిషాల పాటు మరగబెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని రెండురోజుల పాటు తాగాలి. అలా తాగితే మీకున్న అనారోగ్య సమస్యలు మటుమాయమై పోతాయంటున్నారు వైద్యులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ నమస్కారంతో 638 కండరాలకు శక్తి... ఏ నమస్కారం?