నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ నీరు శరీరానికి మేలు చేస్తుందని మీకు తెలుసా... శరీరంలో నీటి శాతాన్నిబట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 75 శాతం, మెదడులో 85 శాతం నీరుంటుంది. ఆహారం కన్నా కూడా నీటి ద్వారా శరీరానికి అందే పోషకాలూ అధికమే.
అందుకే నీరు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. మనం తాగే ప్రతి చుక్కనీరు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. నీరు తరచూ తాగుతుండటం వల్ల శరీరాన్ని డీ-హైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. రోజుకు ఒత లీటరు నుంచి 3 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
* ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున నీళ్లు తాగాలి.
* అన్నం తినేముందు నీటిని తాగుతుండాలి.
* వ్యాయామాలు చేసేముందు కూడా నీళ్లు తాగాలి.
* బయటకెళ్లినప్పుడు కూడా కొద్ది కొద్దిగా మంచినీళ్లు తాగుతుండాలి.
* కాఫీ, టీలకు బదులు మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
* పనిచేస్తున్న సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి.