వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయా? అయితే, రాగి పాత్రలో నీరు తాగండి!
పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇళ్ళలో రాగి పాత్రలు, గ్లాసులు, చెంబులు కనిపించేవి. అయితే, కాలంతో పాటు మనుషులు కూడా మారిపోవడంతో వంటిట్లోని సామాగ్రి కూడా మారిపోయింది.
పూర్వకాలంలో ప్రతి ఒక్కరి ఇళ్ళలో రాగి పాత్రలు, గ్లాసులు, చెంబులు కనిపించేవి. అయితే, కాలంతో పాటు మనుషులు కూడా మారిపోవడంతో వంటిట్లోని సామాగ్రి కూడా మారిపోయింది. ఫలితంగా రాగి పాత్రలు, గ్లాసులకు బదులు... స్టీలు, వెండి పాత్రలు, గ్లాసులు కనిపిస్తున్నాయి.
అయితే, వెనుకటి రోజుల్లో రాగి పాత్రలను అధికంగా వినియోగించడానికి కారణం లేకపోలేదు. రాగి పాత్రలు ఇంట్లో ఉన్నా... రాగి పాత్రల్లో తయారు చేసి వంటలు ఆరగించినా ఎలాంటి రోగాలురావని చెపుతుండేవారు. దీనికి కారణం రాగి పాత్రలకు యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉండటమేనట. అందుకే మన పెద్దవారు రాగి చెంబుల్లో నిల్వ చేసిన నీటిని సేవిస్తూ వచ్చారు. ఈ నీటిని సేవించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే...
రాగి పాత్రలోని నీటిని తాగితే కడుపులో మంట తగ్గుతుందట. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందట. గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. శరీరం లోపల, ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లను మానడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
వృద్ధాప్యఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగపడుతుందట. ఆర్థరైటిస్ రాకుండా కీళ్ల నొప్పుల బారిన పడకుండా చూస్తుందట. శరీరంలోని వివిధ అయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుందని గృహ వైద్య నిపుణులు చెపుతున్నారు.