జీలకర్రను నేతిలో వేయించి అన్నంలో కలుపుకుని తింటే...
పోపుల డబ్బాలో వుండే దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దీన్ని రోజూ వాడుతూ వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పొద్దున్నే వికారం, తలతిప్పడం వంటి వాటితో బాధపడేవారు ఉదయం పూట జీలకర్రను నెయ్యిలో వేయించుకుని అన్నంలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జీర్
పోపుల డబ్బాలో వుండే దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. దీన్ని రోజూ వాడుతూ వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పొద్దున్నే వికారం, తలతిప్పడం వంటి వాటితో బాధపడేవారు ఉదయం పూట జీలకర్రను నెయ్యిలో వేయించుకుని అన్నంలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండటం వల్ల ఇవి తీసుకుంటే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓ కప్పు నీళ్లలో జీలకర్ర వేసి మరిగించి కాసేపటి తర్వాత ఆ నీళ్లను వడకట్టి అందులో తేనె, తులసి ఆకులు వేసి తాగితే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
లోబీపి వున్నవారు జీలకర్రను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు నింయత్రణలో వుంటుంది. మధుమేహం వున్నవారికి ఇది బాగా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుంటాయి. రక్తహీనతతో బాధపడేవారు జీలకర్రను తీసుకుంటే ఎర్రరక్త కణాల వృద్ధి జరుగుతుంది.
మహిళలు నెలసరి సమయంలో జీలకర్రకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే రక్తస్రావం సక్రమంగా జరుగుతుంది. రకరకాల నొప్పులు అదుపులో వుంటాయి.