నడుము నొప్పితో బాధపడుతున్నారా? చిట్కాలు పాటించండి
నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఐతే ఈ చిట్కాలు పాటించండి. కూర్చునేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాల్ని ముందుకు కుంచించడం కాకుండా పొడవుగా శరీరం కిందకు జరపాలి. కడుపు భాగం లోపలికి జరగాలి. శరీరం భ
నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఐతే ఈ చిట్కాలు పాటించండి. కూర్చునేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచాలి. భుజాల్ని ముందుకు కుంచించడం కాకుండా పొడవుగా శరీరం కిందకు జరపాలి. కడుపు భాగం లోపలికి జరగాలి. శరీరం భారీకాయంగా ఉండి ఎక్కువ బరువు ఉంటే వెన్ను మీద అధిక ఒత్తిడి కలుగుతుంది. అందుకని ఆహార నియమాల్ని పాటిస్తూ శరీరానికి తగ్గ బరువును కలిగి ఉండాలి.
ఆహారంలో కొవ్వు తక్కువ, కేలరీలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మంచం మీద పడుకోబోయే ముందు, లేచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క ఉదుటున కాకుండా నిదానంగా లేవడం, నిదానంగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. తల కింద దిళ్లు మరీ ఎత్తుగా ఉండకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.