Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వర్షాకాలంలో రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. ఉడికిన ఆహారాన్ని వేడివేడిగా తీసుకోండి!

వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంతో పాటు వ్యాధులు కూడా సులభంగా వచ్చేస్తాయి. అందుచేత వర్షాకాలంలో తొలుత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా రోడ్డు సైడ్ ఫుడ్‌ను టేస్ట్ చేయనే కూడదు. రోడ్డు సైడ్ ఉండే ఆహార

Advertiesment
Avoid eating roadside food during the rainy season
, గురువారం, 7 జులై 2016 (12:32 IST)
వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంతో పాటు వ్యాధులు కూడా సులభంగా వచ్చేస్తాయి. అందుచేత వర్షాకాలంలో తొలుత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా రోడ్డు సైడ్ ఫుడ్‌ను టేస్ట్ చేయనే కూడదు. రోడ్డు సైడ్ ఉండే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయని.. ఇష్టానికి లాగిస్తే మాత్రం అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
రోడ్డు సైడ్ ఉండే ఆహార పదార్థాలను వడ్డించే వారి చేతులు శుభ్రంగా ఉండకపోవడంతో పాటు.. ఆ ఆహారంలోనూ క్రిములు సులభంగా వచ్చి చేరడంతోనూ.. తప్పక అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే స్నాక్స్, ఆహార పదార్థాలను చాలామటుకు తీసుకోకపోవడం మంచిది. ఇంకా వర్షాకాలం పొట్టలో ఇన్ఫెక్షన్‌ను దూరం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. 
 
ఉడికిన, వేడి వేడి ఆహారాన్ని మాత్రమే వర్షాకాలంలో తీసుకోవాలి. నూనెలో వేయించిన ఆహార పదర్థాలకు వీలైనంత దూరం ఉండాలి. ఇలాంటి ఆహారాలు మన జీర్ణాశయంలో సమస్యలను కలిగిస్తాయి. తద్వారా ఇన్ఫెక్షన్లు తప్పవు. ఇంకా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లల చేతుల్ని అప్పుడప్పుడు వేడి నీటితో కడుగుతుండాలి. వర్షాకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. యాంటీ బాక్టీరియల్ సబ్బుల్ని వాడాలి. అప్పుడే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు బరువు పెరగాలా.. మటన్ సూప్ ఇవ్వండి.. జంక్ ఫుడ్ వద్దే వద్దు..!