నిద్ర లేవగానే మీరేం చేస్తున్నారు... బెడ్ కాఫీ, లేదా పొగతాగడం వంటి అలవాట్లు ఉన్నాయా... అయితే జాగ్రత్త. అలాంటి అలవాట్లను వెంటనే మానుకోండి లేదంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. దీని వలన జీవిత కాలం ఇబ్బంది పడతారు... వివరాలిలా ఉన్నాయి.
చాలా మందికి ఉదయం లేవగానే మంచం దిగకుండానే కాఫీ తాగేస్తుంటారు. అలా తాగకపోతే కుదరనే కుదరదని చెబుతారు. ఇలాంటి అలవాటు ఉన్నట్లయితే మీరు రిస్క్ లో పడ్డట్టే. కనీసం బ్రష్ కూడా చేయకుండానే.. కాఫీ తాగడం మంచిది కాదు. నోటిలోని క్రిములు కాఫీతో కలిస్తే ఇక అంతే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అబ్బే నాకు సిగరెట్ వెలిగించకపోతే.. కనీసం మోషన్ కూడా రాదని చెప్పే వారు ఉంటారు. టాయిలెట్‌లోకి వెళ్ళాలంటే సిగరెట్ వెలిగిస్తారు. ఇది కూడా సరియైన పద్దతి కాదు. లేవగానే పొగతాగడం వల్ల రక్తంలోకి నేరుగా నికోటి చేరుతుంది. పైగా నోటిలోని క్రిములతో కలసిన నికోటిన్ వెళ్ళుతుంది. దీని వలన దారినపోయే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే.
ఇవే కాదు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఉరుకుల, పరుగుల జీవితంలో కాలకృత్యాలు కూడా పూర్తి చేసుకోకుండానే వెళ్ళే వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారు మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. వారు ఆ రోజంతా అనీజీగానే ఉంటారు. ఇలాంటి పద్ధతులు ఫాలో అవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
బ్రేక్ ఫాస్ట్ మానేయడం ఆఫీస్‌కి సమయానికి చేరుకోవాలనే గాబరాలో టిఫిన్ తినడం మానేయకూడదు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడానికి కాస్త టైం కేటాయిస్తే మంచిది. లేటుగా నిద్రలేవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.