నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో తగినంత ఉప్పు కలిపి...
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనేది మరిచిపోలేని వాస్తవం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టేమన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మన పరిసరాలు, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, మానసిక ప్రశాంతత, నీరు, పీల్చే గాలి లాంటి ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనేది మరిచిపోలేని వాస్తవం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టేమన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మన పరిసరాలు, వాతావరణ ప్రభావం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, మానసిక ప్రశాంతత, నీరు, పీల్చే గాలి లాంటి ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆహార పదార్థాల, వంటకాల తయారీలో నిత్యం రంగు, రుచి, వాసన కోసం వాడే వివిధ సుగంధ ద్రవ్యాలు, దినుసులు చాలా వ్యాధులను రాకుండా నిరోధించడంతో పాటు వచ్చిన వ్యాధులను త్వరగా రూపుమాపేందుకు తోడ్పడుతాయి. అలాంటి వాటిలో జీలకర్ర ముఖ్యమైనది. జీలకర్ర వల్ల మన ఆరోగ్యానికి జరిగే మేలేంటో తెలుసుకుందాం.
1. జీలకర్రలో మంచి ఔషధ గుణాలున్నాయి. దీనిలో శరీరానికి అవసరమయ్యే మాంసకృత్తులు, పిండి, కొవ్వుపదార్థాలు, ఐరన్, క్యాల్షియం, ఇతర విటమిన్లు, సువాసన కల్గించే తైలాలు ఉన్నాయి.
2. జీలకర్ర, ఉప్పు, తేనె, నెయ్యి సమపాళ్లలో కలిపి నూరి తేలు, కందిరీగ, తేనెటీగ లాంటి కీటకాలు కుట్టినప్పుడు ఆయా భాగాలపై పట్టిస్తే మంట, నొప్పి, బాధ, దురద త్వరితంగా తగ్గుతాయి.
3. జీలకర్ర పొడి, బెల్లం సమానంగా కలిపి నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసి రోజూ మూడు పూటలూ తీసుకుంటుంటే జ్వరాలు, పైత్యం వల్ల వచ్చే దద్దుర్లు, దురద తగ్గుతాయి. జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. ఈ మాత్రలను పాలతో తీసుకుంటే మగవారిలో వీర్యం వృద్ది అవుతుంది.
4. చిగుళ్లవాపు, నొప్పి, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి బాధలు ఉన్నప్పుడు జీలకర్ర పొడి, ఉప్పు, కరక్కాయ పొడి సమానంగా కలిపి చేసిన పళ్లపొడితో రోజూ పళ్లు తోముకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
5. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ పడుకునే ముందు ఒక స్పూన్ జీలకర్ర పొడిని అరటి పండులో కలుపుకుని తింటే బాగా నిద్ర పడుతుంది.
6. నేతిలో వేయించిన జీలకర్ర చూర్ణంలో తగినంత ఉప్పు కలిపి రెండు పూటలా తీసుకుంటే ఆడవారిలో బహిష్టు సమయంలో వచ్చే నొప్పి తగ్గి ఋతుక్రమం సక్రమంగా అవుతుంది. గర్బాశయ దోషాలు తొలగిపోతాయి.