Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండె.. కండ బలానికే కాదు సంపూర్ణ ఆరోగ్యానికి మేలైనది జీడిపప్పు!

ప్రకృతిలో జీడిమామిడి పండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, దీంట్లో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో విరివిగా పండే జీడిపళ్లు వేసవిలో లభిస్తాయి.

గుండె.. కండ బలానికే కాదు సంపూర్ణ ఆరోగ్యానికి మేలైనది జీడిపప్పు!
, శనివారం, 23 జులై 2016 (12:43 IST)
ప్రకృతిలో జీడిమామిడి పండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, దీంట్లో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో విరివిగా పండే జీడిపళ్లు వేసవిలో లభిస్తాయి. ఈ పండ్లను తింటే వగరుగా ఉంటాయి. ఈ జీడిరసం బట్టల మీద పడితే మాత్రం ఆ మరక ఎన్ని డిటెర్జెంట్లు రాసినా వదలదు. చర్మం మీద పడినా కొంచెం ప్రమాదమే అంటారు. అందుకే వీటితో కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో ఉండే అనకార్డిక్ ఆమ్లాలు దంత సమస్యలను నివారిస్తాయి. వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినడం వల్ల అతిసార వల్ల కలిగే విరేచనాలు తగ్గుతాయి. ఈ జీడిపప్పు ఆయిల్‌ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోగిస్తారు.
 
జీడి పిక్కలను జీడిపప్పుగా తయారు చేసి విక్రయిస్తుంటారు. కలవారింట కమ్మని వంటలలో చేరిపోతుందీ జీడిపప్పు. వంటలలో ఈ దినుసు పడిందంటే కాస్త కాస్ట్లీవారన్న అభిప్రాయాన్ని వచ్చేస్తుంది. పిండిపదార్థాలు అధికంగా ఉండే ఈ పప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ బి1, విటమిన్ బీ2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 
 
ఈ పప్పుల్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. అందుకే ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు. ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. 
 
ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి. అయితే, ఈ పప్పును ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాయిగా నిద్రపోవాలనుందా? అయితే కాళ్ళకు చెప్పులు లేకుండా నడవండి!