ఉదయాన్నే ఉప్పుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వనగూరుతాయి. నిమ్మ, సముద్రపు ఉప్పు యొక్క ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరం యొక్క సున్నితమైన పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
సాల్ట్ లెమన్ వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది.
విటమిన్ సి శరీర రోగనిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది, ఒక నిమ్మకాయ రోజువారీ విటమిన్ సిలో 139% కలిగి ఉంటుంది.
ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
సాల్ట్ లెమన్ వాటర్ తాగితే శరీర కణాల నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయలో ఉప్పు వేసి తాగటం వల్ల అవి మీ దంతాలకు మేలు చేస్తుంది.
మామూలు నీటి కంటే లెమన్ సాల్ట్ వాటర్ మిమ్మల్ని ఎక్కువగా హైడ్రేట్ చేస్తుంది.
నోరు, గొంతులోని చెడు బ్యాక్టీరియాను చంపి శ్వాసను తాజాగా చేయడంలో సహాయపడుతుంది.
సాల్ట్ లెమన్ వాటర్ రాత్రివేళ తాగితే మంచి నిద్ర పడుతుంది.