మనం ప్రతి రోజు రకరకాల ఆహార పదార్ధాలను, కాయగూరలను, ఆకుకూరలను తింటూ ఉంటాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు రక్తహీనతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకుకూరల్లో ముఖ్యమైనది మునగాకు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తరచుగా ఉపయోగించటం వలన మన ఆరోగ్యానికి అద్బుతమైన ప్రయోజనం ఉంటుంది. అది ఏమిటో చూద్దాం.
1. అధిక బరువుతో బాధపడేవారు లేత మునగ చిగుళ్లు రోజూ రసం తీసుకొని త్రాగితే ఒళ్లు తగ్గుతుంది.
2. మునగచెట్టు వేరును దంచి రసం తీసి ఆ రసంలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి. పక్షవాతం ఉన్నా తగ్గుతుంది.
3. మునగాకులో ఉన్న ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనమేంటంటే..... ఇది లైంగిక వాంచను పెంచుతుంది. అంతేకాకుండా ఇదినపుంసకత్వాన్ని పోగొట్టడంలో ఒక సహజసిద్దమైన ఔషదంలా పని చేస్తుంది. మునగ జిగురు ఆవు పాలలో మెత్తగా నూరి నుదురుమీద, కణతల మీద పట్టి వేస్తే తలనొప్పి త్వరగా తగ్గుతుంది.
4. మునగాకులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని పప్పులో పెట్టుకొని వారంలో రెండు రోజులు తినటం వలన శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.
5. మునగాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవటం వలన కళ్లను ఆరోగ్యంగా ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
6. ఒక టేబుల్ స్పూన్ మునగాకు ఫేస్టులో కొంచెం తేనె, కొంచెం నీటిని కలిపి ప్రతిరోజు ఖాళీ కడుపుతో త్రాగటం వలన శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.
7. మునగాకు ఎముకలను ధృడంగా ఉంచడమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ పేస్టును ముఖానికి తరచూ రాసుకోవటం వలన మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.