Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెమికల్ హెయిర్ డై ఎందుకు...? నేచురల్ హెయిర్ డై ఉంటే... ఎలాగంటే...?

జుట్టుకి న్యాచురల్ కలర్ కోసం ఇంటి చిట్కాలతోనే హెల్తీగా, న్యాచురల్ హెయిర్‌కు ఎలాంటి సమస్య లేకుండా కలర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే హెయిర్ కలర్‌ను సింపుల్‌గా తయారుచేసుకోవచ్చు. ఈ హోం మేడ్ హెయిర్ కలర్స్‌ను ప్రిపేర్ చేసుకుని, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.

కెమికల్ హెయిర్ డై ఎందుకు...? నేచురల్ హెయిర్ డై ఉంటే... ఎలాగంటే...?
, సోమవారం, 8 ఆగస్టు 2016 (15:02 IST)
జుట్టుకి న్యాచురల్ కలర్ కోసం ఇంటి చిట్కాలతోనే హెల్తీగా, న్యాచురల్ హెయిర్‌కు ఎలాంటి సమస్య లేకుండా కలర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే హెయిర్ కలర్‌ను సింపుల్‌గా తయారుచేసుకోవచ్చు. ఈ హోం మేడ్ హెయిర్ కలర్స్‌ను  ప్రిపేర్ చేసుకుని, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
* బ్లాక్ కాఫీ పౌడర్‌ని నీటిలో కలిపి ఉడికించాలి. బాగా స్ట్రాంగ్‌గా తయారైన తర్వాత చల్లార్చాలి. ఇప్పుడు జుట్టుని శుభ్రపరుచుకుని, ఈ కాఫీ డికాషన్‌ని పట్టించాలి. తర్వాత షవర్ క్యాప్‌తో కవర్ చేసుకుని అరగంట ఉండాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే, వేగంగా జుట్టు నల్లబడుతుంది.
* న్యాచురల్‌గా జుట్టుకి బ్లాక్ డై వేసుకోవడానికి ఇది చాలా ఎఫెక్టివ్ టిప్. బ్లాక్ టీ తీసుకుని ఉడికించాలి. అది నల్లగా మారేంతవరకు ఉడికించాలి. ఇప్పుడు జుట్టుని పోర్షన్లుగా విడదీసి, జుట్టుకి పట్టించాలి. దాన్ని వాష్ చేసుకోకుండా జుట్టు నల్లగా అయ్యేంతవరకు, తరచుగా అప్లై చేస్తూ ఉండాలి.
 
* రబ్బరు కాండాన్ని నీటిలో ఉడికించి, వడకట్టాలి. రాత్రంతా చల్లారిన తర్వాత మరుసటి రోజు జుట్టుని ఆ నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే, జుట్టు న్యాచురల్ బ్లాక్ కలర్‌ని పొందుతుంది.
* జుట్టుకి రెడ్ కలర్ తీసుకురావడానికి ఇంట్లోనే ప్యాక్ ప్రయత్నించవచ్చు. బీట్ రూట్, క్యారట్ రెండింటినీ మిక్స్ చేసి రసం తీసి, జుట్టుకి పట్టించడం వల్ల రెడ్ షేడ్ పొందవచ్చు. ఈ రసాన్ని జుట్టు మొత్తానికి పట్టించి, షవర్ క్యాప్ వేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
 
* పాతకాలం నుంచి ఉపయోగిస్తున్న ఈ పద్ధతి ద్వారా జుట్టుని నల్లగా మార్చుకుంటున్నారు. కలర్‌ఫుల్ వెర్షన్స్‌లో హెన్నా అందుబాటులో ఉంటుంది. బర్గండీ, వుడ్ బ్రౌన్ కలర్‌లో ఇవి ఉంటాయి. కానీ కలర్‌లెస్ వెర్షన్‌లో కూడా హెన్నా అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టుకి కండిషనింగ్ అందిస్తుంది. అలాగే జుట్టుకి మాయిశ్చరైజర్‌ని కూడా అందిస్తుంది.
* న్యాచురల్ బ్లాక్ హెయిర్ డై తయారు చేసుకునే న్యాచురల్ పద్ధతుల్లో ఇది ఒక ఎఫెక్టివ్ రెమిడీ. మందారం పువ్వుల రెక్కలు తీసి.. మరుగుతున్న నీటిలో వేయాలి. తర్వాత వడకట్టి, చల్లార్చాలి. ఇప్పుడు దీన్ని జుట్టుకి మసాజ్ చేయాలి. ఇది జుట్టుకి న్యాచురల్ కలర్ ని తీసుకొస్తుంది. అలాగే జుట్టుకి, మాడుకు పోషకాలను అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాస్ సమస్యకు గృహ చిట్కాలు... యాలకుల నీటితో శాశ్వత పరిష్కారం!