భోజనం చేశారా?, అయితే... ఇక ఇలా చెయ్యకండి!!
భోజనం చేశాక... ఇవి ససేమిరా చెయ్యకూడదు... అవేమిటో చూద్దాం... 1. సిగరెట్ తాగరాదు. తిన్న తరువాత తాగే ఒక్క సిగరెట్ 10 సిగరెట్లతో సమానం. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 2. టీ తాగరాదు... టీ వల్ల పెద్ద మొత్తంలో ఆసిడ్స్ విడుదల అవుతాయి. దీనివల్ల
భోజనం చేశాక... ఇవి ససేమిరా చెయ్యకూడదు... అవేమిటో చూద్దాం...
1. సిగరెట్ తాగరాదు. తిన్న తరువాత తాగే ఒక్క సిగరెట్ 10 సిగరెట్లతో సమానం. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
2. టీ తాగరాదు... టీ వల్ల పెద్ద మొత్తంలో ఆసిడ్స్ విడుదల అవుతాయి. దీనివల్ల ఆహారం జీర్ణం అవ్వటం కష్టమవుతుంది.
3. పండ్లు తినకూడదు... భోజనం చేసిన తరువాత పండ్లు తినటం వల్ల కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. ఒకవేళ తినాలనుకున్నవాళ్లు ఒక్క గంట ముందు తినే ముందు కాని, తిన్న తరువాత కాని తీసుకుంటే మంచిది.
4. బెల్టు వదులుగా చేసుకోకూడదు. దీనివల్ల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
5. స్నానం చేయకూడదు... భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తం అంతా కాళ్లకు, చేతులకు మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ.