ప్రకృతిలో లభించే పండ్లు మనిషికి ఓ వరం లాంటివి. ఋతువులకు తగ్గ పండ్లను మనిషి సేవిస్తుంటే శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లభ్యమౌతాయి. పండ్లలో దానిమ్మపండు ఒకటి. దానిమ్మ పండులోని గింజలను కవులు తమ ప్రేయసి దంతాలతో పోలుస్తుంటారు. ఇందులోనున్న పోషక పదార్థాలు అమోఘమంటున్నారు వైద్యులు. కేవలం దానిమ్మ పండు మాత్రమే కాకుండా దానిమ్మ చెట్టుకు చెందిన వేర్లు, చెట్టు బెరడు, ఆకులు, పండ్లు, దానిమ్మ తొక్కలు అత్యుత్తమమైన ఔషధంలా పని చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇందులోని ఔషధ గుణాలేంటో ఓసారి తెలుసుకుందాం...
* జీర్ణక్రియలో మార్పులు సంభవించి మీరు తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే దానిమ్మ పండు రసంలోంచి ఒక చెంచా, అరచెంచా వేడి చేసిన జిలకర పొడి, కాస్త బెల్లం కలుపుకుని రోజుకు మూడు సార్లు సేవించండి. ఇలా వారం రోజులపాటు చేస్తే మీ జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందంటున్నారు వైద్యులు.
* బేదులు ఎక్కువగా అవుతుంటే: 15 గ్రాముల దానిమ్మ తొక్కలు, రెండు లవంగాలు తీసుకోండి. రెండింటిని కలిపి నీటిలో ఉడకబెట్టుకోండి. ఆ నీటిని ప్రతి రోజు మూడు పూటలా సేవించండి. దీంతో బేదులు మటుమాయమంటున్నారు ఆరోగ్య నిపుణులు.