శృంగారం చేద్దామని ఆ పని చేశా... నా భార్య నన్ను దగ్గరకి రానివ్వడంలేదు...

సోమవారం, 6 మే 2019 (18:24 IST)
ఈమధ్యనే పెళ్లయింది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. అందుకని మా తొలిరాత్రి పోస్ట్ పోన్ అయ్యింది. ఈమధ్యనే మాకు కుదిరింది. ఎన్నాళ్లగానో నాలో వున్న కోర్కె కారణంగా నా భార్యతో శృంగారం చేద్దామని ఆమె దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించా.

అంతే... ఆమె ఒక్కసారిగా నన్ను మంచం మీది నుంచి కిందికి తోసేసింది. బుద్ధి లేదా అంటూ అరుస్తూ... దగ్గరకొస్తే బాగోదు అంటూ ఆవేశపడింది. ఆమె ప్రవర్తన చూసి నాకేమీ అర్థంకాలేదు. ఆ రోజు నుంచి ఆ ప్రయత్నం చేయడం మానేశాను. ఆమె కూడా ఏమీ ఎరుగనట్లు ఉదయం లేస్తుంది... తన పాటికి తను వెళ్లిపోతోంది. ఆమెతో శృంగారం ఇక సాధ్యం కాదా... ఏం చేయాలి?
 
పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో భార్యభర్తలయ్యేవారిలో ఒకరికొకరు అంతకుముందు పరిచయం ఉండదు కనుక ఎటువంటి మానసిక బంధం ఉండదు. ఇకపోతే మగపిల్లలకు యౌవన దశకు చేరుకున్న తర్వాత పదేళ్లకు గాని వారికి పెళ్లికాదు. ఇప్పుడు మరీ 30 ఏళ్లు దాటిపోతోందనుకోండి.
 
ఇలా శృంగార సుఖం చవిచూడాలని కాచుక కూచున్న పురుషుడు కొత్తగా పెళ్లయిన తర్వాత భార్య మనసులో ఏమున్నదో పట్టించుకునే ఆలోచన కూడా చేయడు. తొలిరాత్రే ఆ అనుభవం పొందాలని ప్రయత్నం చేస్తాడు. దాంతో అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కనుక ఆ రాత్రికి వాటిని భరిస్తుంది. ఐతే ఇది కొందరిలో రివర్స్ అవుతుంది. మీ విషయంలో అదే జరిగింది. 
 
మానసికంగా దగ్గరైతే కానీ శారీరకంగా దగ్గరవడానికి ఇష్టపడదు స్త్రీ. పెద్దలు కుదిర్చే పెళ్లిలో ఒకరికొకరిని తెలుసుకునేందుకు అంతగా అవకాశం ఉండదు. కాబట్టి శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకోవాలి. ముందుగా ఆమె ఇష్టాయిష్టాలు ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎలాగూ ఇన్నాళ్లు ఆగారు కదా... మరికొన్నాళ్లు ఓపిగ్గా వుండి ఆమే మిమ్మల్ని శృంగారానికి ఆహ్వానించేట్లు చేసుకోండి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆపిల్ టీ తాగితే.. ఒబిసిటీ మటాష్.. (వీడియో)