Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెపటైటిస్‌-బి వ్యాధి సోకిన వారు పెళ్ళి చేసుకోవచ్చా?

హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్‌లలో ఒకటి. దీనిని సీరం హెపటైటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట

హెపటైటిస్‌-బి వ్యాధి సోకిన వారు పెళ్ళి చేసుకోవచ్చా?
, గురువారం, 28 జులై 2016 (16:36 IST)
హెపటైటిస్‌-బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌-బి వైరస్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్ హెపడ్నావైరస్ కుటుంబానికి చెందిన వందల రకాల వైరస్‌లలో ఒకటి. దీనిని సీరం హెపటైటిస్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. 
 
హెపటైటిస్‌-బి వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధి సోకినట్లైతే కాలేయానికి వాపు రావటం, వాంతులు చేసుకోవటం, పచ్చ కామెర్లు వంటివి ఏర్పడడం జరుగుతుంది. ఒక వేళ ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిపడి లివర్ కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. హెపటైటిస్‌-బి వైరస్‌ ఒకసారి శరీరంలోకి ప్రవేశించిందంటే వెంట వెంటనే దాని సంఖ్య విపరీతంగా పెరిగి లివర్‌‌పై ప్రభావం చూపుతుంది. హెపటైటిస్‌-బి సోకిన తొలి దశలో కామెర్లు, వికారం, అన్నం తినాలనిపించకపోవడం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉంటాయి. 
 
హెపటైటిస్‌-బి సోకిన రోగికి ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు. నాటు మందులు వాడటం, చేతులు కాల్పించటం వంటివేమీ చెయ్యకూడదు. ఒకసారి హెపటైటిస్‌-బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు కుటుంబ సభ్యులకు సంక్రమించకుండా టీకాలు వేయించుకోవటం మంచిది. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు చాలా అవసరం. వీళ్లు ఎప్పుడూ రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్లినా హెపటైటిస్‌-బి ఉన్న విషయం ఖచ్చితంగా చెప్పాలి. మద్యం జోలికి వెళ్ళకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ పరీక్ష ఏం చెబుతుంది?
 
హెపటైటిస్‌-బి సోకకుండా జాగ్రత్తలు :
హెపటైటిస్‌-బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గొనకూడదు. ఒకరి టూత్‌బ్రష్షులు, రేజర్లు, నెయిల్‌ కట్టర్ల వంటివి మరొకరు వాడకూడదు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి. డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పిడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం.. చాలా అవసరం! 
 
హెపటైటిస్‌-బి వ్యాధి సోకిన వారు పెళ్ళి చేసుకోవచ్చా?
హెపటైటిస్‌-బి రోగి ఈ విషయాన్ని ముందుగానే అందరికీ తెలిపి, వారి అనుమతితో పెళ్లి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటిస్‌-బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్లు తప్పించి మిగతా అందరూ పిల్లలను కూడా కనొచ్చు.
 
హెపటైటిస్‌-బి వ్యాధికి వైద్యం తప్పనిసరి :
చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరికీ తప్పకుండా టీకా ఇప్పించాలి. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌-బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే- మళ్లీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోటి, మొత్తం మూడు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విపరీతమైన లైంగిక క్రియలో పాల్గొంటే కాలేయం పాడవుతుందా...?