Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లేడీస్... కాఫీ, టీ తాగితే ఆ రిస్క్ కట్...

మధుమేహంతో బాధపడే మహిళలు ఏది తినాలన్నా భయంతో లెక్కలు కట్టుకుని తింటూ వుంటారు. మహిళలే కాదు పురుషులు కూడా మధుమేహం వుంటే ఏవి తినాలో వాటిని మాత్రమే తింటుంటారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే మధుమేహంతో బాధపడేవారు రోజూ ఓ కప్పు కాఫీ లేదా టీ తాగుతుంటే గుండె జ

లేడీస్... కాఫీ, టీ తాగితే ఆ రిస్క్ కట్...
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (17:28 IST)
మధుమేహంతో బాధపడే మహిళలు ఏది తినాలన్నా భయంతో లెక్కలు కట్టుకుని తింటూ వుంటారు. మహిళలే కాదు పురుషులు కూడా మధుమేహం వుంటే ఏవి తినాలో వాటిని మాత్రమే తింటుంటారు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే మధుమేహంతో బాధపడేవారు రోజూ ఓ కప్పు కాఫీ లేదా టీ తాగుతుంటే గుండె జబ్బులు, కేన్సర్ దరిచేరవని తమ పరిశోధనల్లో తేలిందంటున్నారు యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ పైన పరిశోధన చేసిన లిస్బన్, పోర్చుగల్ వైద్యులు. 
 
కాఫీలో వుండే కెఫిన్ ఈ రెండు వ్యాధులను నిరోధిస్తున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలియజేశారు. రోజువారీ 100 నుంచి 300 మిల్లీ గ్రాముల కెఫీన్ తీసుకునేవారిలో ఈ సమస్యను అధిగమించినట్లు కనుగొన్నారు.  600 మందికి పైగా మహిళలపై సుమారు 11 ఏళ్లపాటు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలినట్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొక్కజొన్న తింటే ఏమిటి?(వీడియో)