Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్ఐవీని మించిన ప్రాణాంతక వ్యాధి ఏది?

Advertiesment
హెచ్ఐవీని మించిన ప్రాణాంతక వ్యాధి ఏది?
, మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:57 IST)
ప్రస్తుతం హెచ్.ఐ.విని ప్రాణాంత వ్యాధిగా పేర్కొంటున్నారు. అయితే, దీనికంటే నాలుగింతలు వేగంతో మరో ప్రాణాంతక వ్యాధి ముంచుకొస్తుంది. అదే హెపటీస్ బి వ్యాధి. ఇది కాలేయాన్ని కమ్మేస్తోంది. ఫలితంగా రోగి తక్కువ రోజుల్లోనే మృత్యుకోరల్లోకి చేరుకుంటున్నారు. ఇలాంటి హెపటైటిస్‌ను సకాలంలో గుర్తిస్తేనే పూర్తిగా నివారించవచ్చని లేకపోతే ప్రాణాలకే ముప్పుతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
హెపటైటిస్‌లో నాలుగు రకాలు ఉన్నాయి. ఏ, బీ, సీ, డీ, ఈ లు. వీటిలో ఏ, ఈ రకాలు మాత్రం సాధారణమైనవి కాగా, బీసీడీ వైరస్‌లు మాత్రం ప్రాణాంతక వ్యాధులు. వీటినే క్రానిక్ హెపటైటిస్‌లుగా పిలుస్తారు.
 
కాలేయాన్ని అతివేగంగా దెబ్బతీసే వైరస్ హెపటైటిస్-బి. ఇది ఎయిడ్స్ కంటే కూడా 4 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వల్ల లివర్ కేన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. 
 
అయితే, హెపటైటిస్ ఎ, ఇ కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే, బి,సి,డి రక్తం మార్పిడి ద్వారా, శరీరంలోని ద్రవాల సంపర్కం అంటే ఒకరు వినియోగించిన సూదులు, బ్లేడ్లను, టూత్ బ్రష్‌లను మరొకరు వినియోగించడం, సురక్షితం కాని శృంగారం వల్ల సంక్రమిస్తాయి. తల్లి నుంచి బిడ్డకు కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్టు వారు హెచ్చరిస్తున్నారు. 
 
దీనిబారినపడిన వారిలో తరచూ వాంతులు కావడం, ఆకలి మందగించడం, జ్వరం రావడం, కళ్లు పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపు పచ్చగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధిబారినపడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్న్ పకోడి తయారీ విధానం