Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిగా పుట్టింది.. మగాడిలా మారిపోయింది.. ఎలా.. ఈ వీడియో చూడండి?

Advertiesment
Transgender student takes a selfie EVERY DAY for three years to document his transition from a girl to a man
, శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:36 IST)
ఎసెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజీ స్టూడెంట్ జేమీ రైనా అనే యువతి... పుట్టడం మాత్రం అమ్మాయిగా పుట్టి.. ఆ తర్వాత అబ్బాయిగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను సెల్ఫీలుగా తీసి.. వాటిని ఓ వీడియోగా తీసి యూట్యూబ్‌లో అప్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో షోసల్ మీడియాల్ హల్‌చల్ చేస్తోంది. కేవలం ఒక్క రోజునే ఏడు లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
 
జేమీ రైనాకు సరిగ్గా నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తాను అందరిలా కాకుండా భిన్నంగా ఉండాలని భావించింది. ఎనిమిదేళ్ల వయసులో హెయిర్ కట్ చేసుకుని తాను అబ్బాయిగా కనిపిస్తున్నట్లు అద్దంలో చూసుకునేది. కొన్నేళ్ల తర్వాత అమ్మాయిల పట్ల ఆకర్షణ కలిగి, తరచు గర్ల్‌ఫ్రెండ్ షాబాను కలుసుకునేది. 18 ఏళ్లు వచ్చాక, ప్రతిరోజూ టెస్టోస్టిరాన్ హార్మోన్ తీసుకోవడం ప్రారంభించింది. 
 
అలా చేయడంతో పాటు తనలో వస్తున్న శారీరక మార్పును గ్రహించేందుకు ప్రతి రోజూ సెల్ఫీ తీస్తూ వచ్చింది. లింగమార్పిడి కోసం సర్జరీ చేయించుకోవడంతో పాటు మూడేళ్ల పాటు ప్రతి రోజూ అందుకు అవసరమైన మందులను కూడా తీసుకుంది. ఆ తర్వాత ఆ యువతి ఉన్న జేమీ రైన్స్... పూర్తిగా అతడుగా మారిపోయాడు.
 
హార్మోన్ తీసుకుంటున్న క్రమంలో తనలో కలిగే మార్పులను తెలుసుకునేందుకు తీసిన 1400 ఫొటోలను వీడియోగా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను ఏడు లక్షల మధ్య వీక్షించారు. ఈ వీడియో చూసిన ఓ న్యూస్ చానెల్ ఆమె నుంచి అతడుగా మారే క్రమంపై 'గర్ల్స్ టు మెన్' అనే డాక్యుమెంటరీ తీయడానికి సిద్ధమైంది. 
 
దీనిపై జేమీ రైనా మాట్లాడుతూ.. ఇప్పుడు తనకు చాలా ధైర్యంగా ఉందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని జేమీ అంటున్నాడు. నాలుగేళ్లుగా తనతో పరిచయం ఉన్న గర్ల్ ఫ్రెండ్ షాబా కూడా లింగమార్పిడి విషయంలో తనకు చాలా సహకారం అందించిందని చెప్పాడు. షాబా పేరెంట్స్ మొదట్లో తనతో పెళ్లికి ఒప్పుకోలేదు గానీ, పూర్తిగా అబ్బాయిగా మారిన తర్వాత వారు తనను అంగీకరించారన్నాడు. అయితే, తన పేరు ఇప్పుడు జేమీ అని చెప్పుకొచ్చాడు.
 

Share this Story:

Follow Webdunia telugu