Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను ప్రోత్సహించడానికి చెఫ్ సంజీవ్ కపూర్‌తో అవగాహన ఫిల్మ్‌

Advertiesment
breast cancer awareness

ఐవీఆర్

, సోమవారం, 15 జులై 2024 (21:38 IST)
భారతదేశంలో పెరిగిపోతున్న రొమ్ము క్యాన్సర్ భారం ఆందోళన కలిగించే ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించబడుతున్నారు. ముందస్తుగా గుర్తించడం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది. పెరుగుతున్న కేసులకు వ్యతి రేకంగా పోరాటం చేయగలుగుతుంది, సకాలంలో క్యాన్సర్ సంరక్షణకు మద్దతునిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం వల్ల దీనిపై అవగాహనను భయం నుండి జ్ఞానంగా మార్చవచ్చు, మహిళలు తమ ఆరోగ్యాన్ని చురుగ్గా చూసుకునేలా శక్తివంతం చేయవచ్చు.
 
టాటా మెమోరియల్ హాస్పిటల్‌లోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శలాకా జోషి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “భారత దేశంలో ప్రతీ 30 మంది మహిళల్లో ఒకరిని రొమ్ము క్యాన్సర్ ప్రభావితం చేస్తుంది. గత 25 సంవత్సరాలుగా ఈ కేసుల సంఖ్యలు పెరుగుతున్నాయి. అధిక నివారణ రేటును సాధించడానికి ముందస్తుగా గుర్తించడం చాలా కీలకం. ముందుగా రోగనిర్ధారణ చేస్తే ఐదేళ్లలో 90% కంటే ఎక్కువ విజయం సాధించవచ్చు. దురదృష్టవశాత్తూ, మన దేశంలో 60% మంది మహిళలు ముందస్తు సంకేతాలు, లక్షణాలపై అవగాహన లేకపోవడం, స్క్రీనింగ్ అందుబాటులో లేకపోవడం, వ్యక్తిగత ఆరోగ్యంపై అజ్ఞానం, చికిత్స పట్ల భయం కారణంగా బాగా ముదిరిపోయిన దశలో ఈ వ్యాధితో ఉన్నట్లుగా నిర్ధారించబడుతున్నారు.
 
ప్రారంభ దశలో గుర్తించడం తక్కువ ఇంటెన్సివ్ చికిత్సకు, మెరుగైన జీవన నాణ్యతకు దారి తీస్తుంది. నా క్లినికల్ అనుభవంలో, చాలామంది మహిళలు తమ రొమ్ములలో గడ్డలను విస్మరించారు. ఎందుకంటే అవి నొప్పిని కలిగించవు, కానీ నొప్పిలేని గడ్డలు ప్రమాదం కలిగించకుండా ఉండవని అర్థం చేసు కోవడం చాలా అవసరం. యువతుల్లో కూడా రొమ్ము క్యాన్సర్‌ వృద్ధి  చెందవచ్చు. వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ అజ్ఞానాన్ని తొలగించడం, మహిళలను "రొమ్ము గురించి తెలుసుకునేలా" ప్రోత్సహించడం, త్వరగా వైద్య సహాయం పొందేలా చేయడం మా లక్ష్యం. ఈ పరిజ్ఞానంతో మహిళలకు సాధికారత కల్పించడం వల్ల వ్యాధి భారాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది" అని అన్నారు.
 
టాటా ట్రస్ట్స్ 1940ల నుండి కూడా ఆంకాలజీ పరిశోధన, చికిత్స పురోగతి మొదలుకొని సమగ్ర క్యాన్సర్ సంరక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దాకా భారతదేశంలో క్యాన్సర్ సంరక్షణలో అగ్రగామిగా ఉంది. స్క్రీనింగ్‌కి యోస్క్‌లు, డయాగ్నస్టిక్ యూనిట్‌లను టాటా ట్రస్ట్స్ స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ ఆరోగ్య మిషన్‌తో కలిసి అధిక-నాణ్యత, సరసమైన సంరక్షణ, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లకు మద్దతునిచ్చేందుకు వీలు కల్పించింది. భారతదేశమంతటా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహనను పెంపొందించడంలో భాగంగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, అందుబాటులో ఉండే చికిత్స, కారుణ్య సంరక్షణకు నాయకత్వం వహించడం వంటి వాటికి కూడా ప్రాధాన్యమిచ్చింది.
 
ఈ లక్ష్యంతో టాటా ట్రస్ట్స్ 'గాంత్ పే ధ్యాన్' ('ఫోకస్ ఆన్ ది లంప్') అనే ఒక ప్రత్యేక ప్రచారాన్ని ఆవిష్కరించింది. మహిళలు వంట చేయడంలో, వారి ఆహారంలో ముద్దలు ఏర్పడకుండా తీసుకునే జాగ్రత్తల నుండి ఇది ప్రేరణ పొందింది. 'గాంత్' (గడ్డ) యొక్క ఏదైనా సంకేతం కోసం క్రమం తప్పకుండా వారి రొమ్ములను స్వీయ-పరీక్ష చేసుకునేందుకు అదే శ్రద్ధ వహించేలా చేస్తుంది.
 
స్థానిక సమూహాలతో తన క్షేత్రస్థాయి కార్యకలాపాలను పూర్తి చేస్తూ, ఈ ట్రస్ట్స్ ఎక్కువ మంది మహిళలను వారి ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వడానికి, స్వీయ-సంరక్షణను స్వీకరించడానికి ఒక సామాజిక అవగాహన చలన చిత్రాన్ని ఆవిష్కరించింది. పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఈ చిత్రంలో నటించారు. మహిళా వీక్షకులను చేరుకోవడం, వారిని దీనితో మమేకం చేసే లక్ష్యంతో ఈ చిత్రం రూపొందించబడింది. వంట చేయడం, రొమ్ము స్వీయ-పరీక్షలను అనుసంధానించే సరళమైన రూపకాన్ని సృజనాత్మకంగా అందిస్తూ రొమ్ము స్క్రీనింగ్ కోసం ముందుకు వచ్చేందుకు మహిళలను ప్రేరేపించాలని ఈ చిత్రం భావిస్తోంది. తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని,  ప్రాణాలను రక్షించడంలో సహాయపడండి అని ఈ చిత్రం వారిని ప్రోత్సహిస్తుంది. తక్కువ అవగాహన, సామాజిక నిబంధనలు, లింగ పక్షపాతం మొదలుకొని వైద్య సహాయం కోసం ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడటం వరకు - మహిళలకు ఆలస్యంగా వైద్య సంరక్షణకు దారితీసే విభిన్న కారకాలను ఇది చర్చిస్తుంది.
 
“స్వీయ-రొమ్ము పరీక్ష ద్వారా ముందస్తుగా గుర్తించడం ప్రాముఖ్యతను మహిళలకు తెలియజేయడంలో ఈ అంశంపై అవగాహన కల్పించడం పోషించే కీలక పాత్రను టాటా ట్రస్ట్స్‌లో మేం గుర్తించాం. ఈ క్లిష్టమైన ప్రవర్తన మార్పును స్వీకరించడానికి, వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మహిళలను ప్రోత్సహించడానికి గాంత్ పే ధ్యాన్ అనేది మేం చేపట్టిన కార్యక్రమం. దేశవ్యాప్తంగా మేం నిర్వహించే కమ్యూనిటీ కార్యక్రమాలలో మహిళలు ఈ సందేశానికి చూపిన ఆదరణ, ఈ  సినిమా ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి మమ్మల్ని మరింతగా ప్రోత్సహించింది. స్వీయ రొమ్ము పరీక్ష ఎంత సరళంగా, సులభంగా ఉంటుందో, జీవితాన్ని ఎంత సమర్థవంతంగా మారుస్తుందో అర్థం చేసుకోవడంలో ఈ చిత్రం వారికి సహాయపడింది’’ అని టాటా ట్రస్ట్స్ బ్రాండ్, మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌కు చెందిన శిల్పి ఘోశ్ పేర్కొన్నారు.
 
నివారణ, చురుకైన ఆరోగ్య సంరక్షణ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, సమాచార సంభాషణలను ప్రోత్సహిం చడం, అవగాహనలో క్లిష్టమైన అంతరాలను తొలగించడం, ఐక్య కార్యాచరణను ప్రేరేపించడాన్ని టాటా ట్రస్ట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక ప్రయోగ చిత్రం వంటి ప్రయత్నాలు శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి, సమాజాలలో ఆశ, ఆరోగ్యం అనే చైతన్య తరంగాలను సృష్టిస్తాయి. నేపథ్యం లేదా స్థానంతో సంబంధం లేకుండా, ప్రతి స్త్రీ కూడా అవసరమైన సంరక్షణను పొందేందుకు, ఆరోగ్యం వైపు తాను చేసే ప్రయాణంలో మద్దతును పొందేలా చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కవల సోదరీమణుల భరతనాట్యం అరంగేట్రం- భక్త రామదాసు కూర్చిన మంగళం