Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 గంటల పాటు పని చేసే ఉద్యోగులకు గుండెపోటు తప్పదట!

Advertiesment
Sweden is shifting to a 6-hour work day
, సోమవారం, 5 అక్టోబరు 2015 (12:28 IST)
సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో 8 గంటల డ్యూటీ అవర్స్ అమలవుతోంది. అయితే, ఈ డ్యూటీ అవర్స్ అమలవుతున్న దేశాల్లోని ఉద్యోగుల్లో 33 శాతం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు స్వీడన్ పరిశోధకులు తేల్చారు. ఇదే విషయాన్ని స్వీడన్ ప్రభుత్వానికి తెలియజేయడంతో ఆ ప్రభుత్వం డ్యూటీ అవర్స్‌ను 6 గంటలకు కుదించింది. 
 
తక్కువ పనిసమయం ఉంటే ఉద్యోగులతో పని పర్‌ఫెక్ట్‌గా చేయించడంతో పాటు వాళ్ల ఆరోగ్యాలను కూడా కాపాడినట్టవుతుందని స్వీడన్ అధ్యయనకారులు తేల్చారు. స్వీడన్‌లో ఆరు లక్షల మంది ఉద్యోగులపై, వాళ్ల పనితీరుపై సర్వే చేసిన అధ్యయనకారులు.. పనితో పాటు ఎక్కువ సమయాన్ని కుటుంబానికీ, వ్యాయామానికీ కేటాయించడం ద్వారా వారికి అప్పజెప్పిన పనిని ఖచ్చితత్వంతో చేస్తున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. 
 
తక్కువ టైమ్ ఉంటేనే సోషల్‌మీడియాను కూడా తక్కువ వాడుతున్నారని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఆరుగంటలు పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల మహిళలకు ఎక్కువ లాభం చేకూరనుంది. ఇల్లు, పిల్లలు వంటి బాధ్యతలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలుగుతారు. అందుకే అక్కడి మహిళ ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu